త్వరలో పెళ్లి పీటలెక్కనున్న పీవీ సింధు

pvsindhu wedding

భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. హైదరాబాదుకు చెందిన వ్యాపారవేత్త వెంకటదత్త సాయితో ఆమె ఏడడుగులు వేసేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయంపై సింధు కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించగా, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నెల 22న ఉదయూర్‌లో వీరి వివాహం గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరవుతారని సమాచారం. వివాహం అనంతరం 24న హైదరాబాద్లో ప్రత్యేక రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ వేడుకకు క్రీడా, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరవుతారని అంచనా.

వరుడు వెంకటదత్త సాయి హైదరాబాదుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త. సింధు కుటుంబంతో సాయి కుటుంబానికి ఎప్పటినుంచో స్నేహబంధం ఉంది. ఈ పరిచయం కాస్తా పెళ్లి సంబంధంగా మారింది. పెళ్లి పనులు త్వరలోనే ప్రారంభం కానున్నట్లు తెలిసింది. పీవీ సింధు క్రీడా ప్రపంచంలో తన ప్రతిభతో దేశానికి గర్వకారణంగా నిలిచారు. వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ సహా పలు అంతర్జాతీయ మెడల్స్‌ గెలుచుకుని ఆమె భారత బ్యాడ్మింటన్‌ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. ఆమె పెళ్లి కూడా దేశవ్యాప్తంగా ప్రత్యేక ఆసక్తి కలిగిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Reka bentuk modular untuk pemasangan dan penyesuaian yang mudah kepada mana mana persekitaran. Der tanzende bär | eine traurige kurzgeschichte. For details, please refer to the insurance policy.