VIDEO: వింటేజ్ రమణ గోగులను గుర్తు చేశాడుగా..

ramanagogula godari

సంగీత దర్శకుడు రమణ గోగుల సింగర్గా రీఎంట్రీ ఇస్తున్నారు. వెంకటేశ్ నటిస్తోన్న ‘సంక్రాంతికి వస్తున్నాం’లో ఆయన ఓ పాట పాడారు. తన తొలి సినిమాకు వెంకీనే హీరో అని, ఇప్పుడు ఆయన సినిమాలోనే సాంగ్ పాడినట్లు తెలిపారు. ఆయన పాడుతున్న వీడియోను డైరెక్టర్ అనిల్ ట్వీట్ చేశారు. ఈ వీడియోను షేర్ చేస్తూ వింటేజ్ రమణ గోగుల గుర్తొస్తున్నారని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఈ సాంగ్ లిరికల్ వీడియో డిసెంబర్ 3న విడుదల కానుంది.

ప్రముఖ హీరో వెంకటేశ్‌ మరియు అనిల్‌ రావిపూడి కలయికలో రూపొందుతున్న తాజా చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. గతంలో ఈ జోడీ ఎఫ్‌2 మరియు ఎఫ్‌3 వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను అందించి వినోదాన్ని పంచిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే విజయవంతమైన కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి దిల్‌ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్‌తో పాటు సంక్రాంతి పోటీలో మేము కూడా ఉన్నాం అని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. క్రైమ్‌ కామెడీ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో వెంకటేశ్ భార్య పాత్రలో ఐశ్వర్య రాజేశ్ నటిస్తున్నారు. ఇక అతని మాజీ ప్రేయసిగా మీనాక్షి చౌదరి కనిపించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే పూర్తయిన నేపథ్యంలో ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందించగా సమీర్‌ రెడ్డి సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Finding opportunity in a saturated market : how to thrive in the skincare and beauty industry biznesnetwork. Estratégias de sucesso para prevenir recaídas na clínica de recuperação para dependentes químicos. 佐?.