లంచం, మోసం ఆరోపణలు..గౌతమ్‌ అదానీపై అమెరికాలో కేసు..!

Case against Gautam Adani in America

న్యూయార్క్‌: భారతీయ వ్యాపార దిగ్గజం, అదానీ గ్రూప్ అధినేత, ప్రపంచ సంపన్నుల్లో ఒకరైన గౌతమ్ అదానీపై అమెరికాలోని న్యూయార్క్‌లో కేసు నమోదైంది. మల్టీబిలియన్ డాలర్ల లంచం, మోసానికి పాల్పడినట్లు గౌతమ్ అదానీ, ఆయన బంధువు సాగర్ అదానీ సహా మరో ఏడుగురు ఈ స్కీంలో నిందితులుగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు ప్రముఖ ఆంగ్ల మీడియా సంస్థలు రాయిటర్స్, బ్లూమ్‌బర్గ్ నవంబర్ 21న నివేదించాయి. సోలార్ ఎనర్జీ కాంట్రాక్టుల్ని దక్కించుకునేందుకు ఈ క్రమంలోనే అదానీ గ్రూప్.. భారత ప్రభుత్వ అధికారులకు పెద్ద మొత్తంలో లంచాలు ఇచ్చినట్లు అభియోగాలు మోపారు. ఇటీవల గౌతమ్ అదానీ.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన డొనాల్డ్ ట్రంప్‌కు శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే తాజాగా ఆయనపై అక్కడ కేసు నమోదవడం చర్చనీయాంశంగా మారింది. ట్రంప్‌కు అభినందనలు తెలిపిన తర్వాత అదానీ.. గ్రీన్ ఎనర్జీలో పెట్టుబడుల్ని ప్రకటించినట్లు రాయిటర్స్ వెల్లడించింది. ఇటీవల ట్రంప్ ఎనర్జీ కంపెనీలకు నిబంధనల్ని సడలించనున్నట్లు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వీరు 20 సంవత్సరాలలో 2 బిలియన్ డాలర్ల లాభం పొందే అవకాశం ఉన్న.. సౌరశక్తి సరఫరా ఒప్పందాల్ని పొందేందుకు భారత అధికారులకు .. 265 మిలియన్ డాలర్ల మేర లంచాలు చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అదానీ గ్రీన్ ఎనర్జీలో.. అక్రమ మార్గాల ద్వారా.. ఆ కంపెనీ పెట్టుబడిదారులు, రుణ దాతల నుంచి సుమారు 3 బిలియన్ డాలర్లకుపైగా రుణాలు, బాండ్లు సేకరించిందని అభియోగాలు నమోదయ్యాయి.

యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమీషన్ ప్రకారం అదానీ.. అమెరికన్ ఇన్వెస్టర్లను మోసగించారని, అధికారులకు లంచాలు ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. అదానీతో పాటుగా ఇందులో అదానీ గ్రీన్ ఎనర్జీ ఎగ్జిక్యూటివ్ అయిన ఆయన అల్లుడు సాగర్ అదానీ (30), అజూర్ పవర్ గ్లోబల్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ సిరిల్ క్యాబెన్స్ ప్రముఖంగా ఉన్నట్లు తెలిసింది. తప్పుడు స్టేట్‌మెంట్లు, ప్రకటనల ద్వారా లబ్ధి పొందినట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే ఫారెన్ బిజినెస్ డీలింగ్స్ కింద అమెరికాలో ఉన్న ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ కింద అభియోగాలు నమోదు చేశారు. గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వినీత్ జైన్, రంజిత్ గుప్తా, సిరిల్ క్యాబెన్స్, సౌరభ్ అగర్వాల్, దీపక్ మల్హోత్రా రూపేశ్ అగర్వాల్ వంటి వారిపై కేసులు నమోదయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Portfolios j alexander martin. 15 side hustles to make extra money online proven. With businesses increasingly moving online, digital marketing services are in high demand.