యూట్యూబ్‌ ఛానల్స్‌ కు షాక్ ఇచ్చిన చిత్రపరిశ్రమ

youtubechannels

ప్రస్తుతం యూట్యూబ్ వాడకం బాగా పెరిగింది. కొంతమంది పాపులార్టీ కోసం, మరికొంతమంది పాపులార్టీ , డబ్బు కోసం యూట్యూబ్ చానెల్స్ ను రన్ చేస్తున్నారు. ముఖ్యంగా చిత్రసీమ కు సంబంధించి కొంతమంది యూట్యూబ్ చానెల్స్ పెట్టి రివ్యూస్ , హీరో, హీరోయిన్ తాలూకా విశేషాలు తెలియజేస్తూ వస్తున్నారు. అయితే వీరిలో కొంతమంది నెగిటివ్ ప్రచారం చేస్తుండడంతో సినిమాలపై ఆ ప్రభావం పడుతుంది. ఈ క్రమంలో తమిళ్‌ ఫిల్మ్ యాక్టివ్‌ ప్రొడ్యూసర్స్‌ అసోసియేషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ఓ పోస్ట్‌ పెట్టింది. రివ్యూలు పేరుతో నటీ నటులపై వ్యక్తిగత విమర్శలకు పాల్పడితే ఊరుకోమని కరాఖండిగా చెప్పింది. థియేటర్లలోకి మీడియాను అనుమతించవద్దని సినిమా హాలు యజమానులకు విజ్ఞప్తి చేసింది. “ఈ సంవత్సరం రిలీజ్ అయిన చాలా సినిమాలపై యూట్యూబ్ రివ్యూలు ప్రభావం చూపాయి. ముఖ్యంగా కమల్​ హాసన్ ఇండియన్‌ 2, రజనీ కాంత్​ వేట్టయన్‌, సూర్య కంగువా సినిమాల రిజల్ట్​పై పబ్లిక్‌ టాక్‌, యూట్యూబ్‌ ఛానల్స్‌ ఇచ్చే రివ్యూలు, విశ్లేషణలు చాలా ఎఫెక్ట్‌ చూపింది. రానురాను ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇదొక సమస్యగా మారుతోంది. అందుకే దీనిని కట్టడి చేసేందుకు ఫిల్మ్ ఇండస్ట్రీలోని అన్ని సంఘాలు ఏకం కావాల్సిన అవసరం ఉంది.

ఇండస్ట్రీ అభివృద్ధికి అందరూ కలిసి సమష్టిగా కృషి చేయాలి. ముఖ్యంగా ఇందులో భాగంగా థియేటర్‌ యజమానులు యూట్యూబ్‌ ఛానల్స్‌ను సినిమా థియేటర్​ ప్రాంగణంలోకి అస్సలు అనుమతించకూడదు. మొదటి రోజు ఫస్ట్‌ షో సమయంలో థియేటర్‌ దగ్గర పబ్లిక్‌ రివ్యూలకు అవకాశం కల్పించకూడదు. అలాగే, రివ్యూల పేరుతో నటీ నటులు, డైరెక్టర్స్​, ప్రొడ్యూసర్స్​పై వ్యక్తిగత విమర్శలను కూడా మేము ఖండిస్తున్నాం. ఇకపై అలాంటి వాటికి పాల్పడితే అస్సలు అంగీకరించేది లేదు” అని పేర్కొంది. యూట్యూబ్‌ ఛానల్స్‌, కొంతమంది నెటిజన్లు ఇచ్చే రివ్యూలు, చాలా సార్లు సినిమా ఫలితాలపై ప్రభావం చూపుతుంటాయి. అయితే ఇదే విషయాన్ని తాజాగా తమిళ్‌ ఫిల్మ్ యాక్టివ్‌ ప్రొడ్యూసర్స్‌ అసోసియేషన్‌ తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Truecaller appoints ogochukwu onwuzurike as country manager for nigeria biznesnetwork. Estratégias de sucesso para prevenir recaídas na clínica de recuperação para dependentes químicos. 『?.