‘పుష్ప 2’ ట్రైలర్ నిడివి ఎంతో తెలుసా..?

pushpa 2 dec 5

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న “పుష్ప-2” చిత్రం అధికారిక విడుదల తేదీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని తెలిపారు. మొదట ఈ సినిమా డిసెంబర్ 6న విడుదల చేయాలని భావించినా, ఇప్పుడు ఒక రోజు ముందుగా విడుదల చేయనున్నట్లు తెలిపారు.

“పుష్ప” ముందు భాగం బ్లాక్బస్టర్ హిట్ కావడంతో, అభిమానుల్లో ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అల్లు అర్జున్ పాత్ర, కథ మరియు మ్యూజిక్ పై అభిమానులలో ఎంతో ఆసక్తి ఉంది. ఈ చిత్రాన్ని ఫస్ట్ పార్ట్ నుంచి ఎక్కువగా ప్రొడక్షన్ విలువలు, సాంకేతికతతో రూపొందిస్తున్నారని అంటున్నారు.

కాగా ఈ మూవీ ట్రైలర్ ఈ నెల 17న విడుదల చేయబోతున్నారు. పట్నాలో సాయంత్రం 5 గంటలకు లాంచ్ ఈవెంట్ ప్రారంభం కానుంది. ట్రైలర్ నిడివి 2 నిమిషాల 44 సెకన్లు ఉండనున్నట్లు తెలుస్తుంది. కాగా దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన నగరాల్లో మూవీ టీమ్ ప్రమోషన్లు చేయనుంది. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్నారు. దేవి శ్రీ మ్యూజిక్ అందిస్తుండగా..థమన్ BGM అందిస్తున్నారు. అలాగే ఈ మూవీ లో ఐటెం సాంగ్ లో శ్రీలీలే చిందులేయబోతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Happy gifting, and may your office holiday party be filled with joy, laughter, and a touch of holiday magic !. Nossa clínica possue um elevado padrão de qualidade no tratamento de pessoas com dependência química e saúde e mental. 写真?.