సమంత ఇరగదీసింది

sam dance

వరుణ ధావన్ రాబోయే సినిమా ‘బేబీ జాన్’ నుంచి ఇటీవల విడుదలై దుమ్ము రేపుతున్న ‘నైన్ మటక్కా’ సాంగ్‌కు సమంత, వరుణ్ ధావన్ వేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో లో సమంత డాన్స్ ఇరగసింది. గత కొన్ని రోజులుగా వ్యక్తిగత, ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతోన్న సమంత ప్రస్తుతం కోలుకుంటున్నారు. మయోసైటిస్‌ వ్యాధి నుంచి క్రమంగా బయటపడుతోన్న సామ్‌లో తాజా వెబ్‌ సిరీస్‌ సిటాడెల్‌ కొత్త ఉత్సాహాన్ని నింపిందని చెప్పాలి. రాజ్‌ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. విడుదలైన తొలి రోజు నుంచి ఈ వెబ్ సిరీస్‌ టాప్‌లో కొనసాగుతోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం సమంత సిటాడెల్‌ వెబ్‌ సిరీస్‌ సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తోంది. స్ట్రీమింగ్ మొదలై ఇన్ని రోజులు అవుతోన్నా ఇప్పటికీ చిత్ర యూనిట్‌ ప్రమోషన్స్‌ను కొనసాగిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే చిత్ర యూనిట్‌ తాజాగా సక్సెస్‌ పార్టీని నిర్వహించింది. ఇందులో సమంత చాలా ఉత్సాహంగా కనిపించింది. వరుణ్ ధావన్‌తో కలిసి స్టెప్పులు వేసింది.

ఇదిలాఉండగా.. సిటాడెల్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో సామ్ లవ్‌లో ఉన్నట్లుగా గాసిప్స్ వైరల్ అయ్యాయి. అయితే ఇది ఆ తర్వాత పుకారుగానే మిగిలిపోయింది. కొద్దిరోజులుగా సమంత పర్సనల్ లైఫ్‌కు సంబంధించి మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సామ్ బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్, బోనీ కపూర్ కుమారుడు హీరో అర్జున్ కపూర్‌తో సమంత రిలేషన్‌లో ఉన్నారంటూ గాసిప్స్ వైరల్ అయ్యాయి. ఇటీవల సమంత షేర్ చేసిన కవితకు అర్జున్ రిప్లయ్ ఇవ్వడం బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. ఏది ఏమైనప్పటికి తన మాజీ భర్త నాగ చైత్యన రెండో పెళ్లి చేసుకోబోతుండగా ..దానిని ఏమాత్రం పట్టించుకోకుండా సమంత ఫుల్ గా ఎంజాయ్ చేయడం ఆమె అభిమానులను సంతోష పెడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

With businesses increasingly moving online, digital marketing services are in high demand. Nossa clínica possue um elevado padrão de qualidade no tratamento de pessoas com dependência química e saúde e mental. ウトレイジ.