గేమ్ ఛేంజర్ నుండి ‘హైరానా’ సాంగ్ వచ్చేస్తుంది

game changer 3rd song promo

డైరెక్టర్ శంకర్ (Shankar) – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram CHaran) కలయికలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్. దిల్ రాజు నిర్మాణంలో పాన్ ఇండియా మూవీ గా భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటుంది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుండడంతో..మేకర్స్ ప్రమోషన్ పై దృష్టి సారించారు. ఇప్పటికే ఈ సినిమాలోని రెండు సాంగ్స్ విడుదలై ఆకట్టుకోగా..ఇప్పుడు మూడో సాంగ్ రాబోతుంది.

రేపు నానా హైరానా లిరికల్ సాంగ్ రిలీజ్ కాబోతోంది. దానికి సంబంధించిన చిన్న బిట్వీన్ ది సెట్స్ వీడియోని నిన్న సాయంత్రం తమన్ పంచుకున్నాడు. కార్తీక్, శ్రేయ ఘోషల్ లు పాడిన రెండు మూడు లైన్లు మాత్రమే అందులో పొందుపరిచారు. మిగిలిన టైంలో వీళ్ళ ఇంటర్వ్యూ విశేషాలు పెట్టేశారు. అయితే కేవలం పాటలో కొద్ది భాగమే అయినప్పటికీ రామజోగయ్యశాస్త్రి రచనలో నానా హైరానా అంటూ సాగే చిన్న లిరిక్ మ్యూజిక్ లవర్స్ కి విపరీతంగా ఎక్కేసింది. నిమిషాల వ్యవధిలోనే వేలాదిగా ట్వీట్లు, ఎడిట్లు ప్రత్యక్షమైపోయాయి. ఇక ఈ సాంగ్ ఒరిజినల్ లొకేషన్లలో ఉన్న అందాన్ని మెరుగుపరిచి చూపించడం దీని ప్రత్యేకత. విదేశాల్లో, సెట్స్ లో భారీ వ్యయంతో చిత్రీకరించిన ఈ పాట గేమ్ ఛేంజర్ ప్రత్యేక ఆకర్షణలో ఒకటిగా నిలుస్తుందని చెప్పొచ్చు.

ఇక ఇండస్ట్రీలో ముగ్గురు హీరోల అభిమానుల మధ్య సోషల్ మీడియాలో పెద్ద వార్ నడుస్తుంది. ఆ ముగ్గురు హీరోలు… రామ్ చరణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్. ఆర్ఆర్ఆర్, పుష్ప తర్వాత నుంచే ఈ వార్ అనేది కొనసాగుతూ వస్తుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ నుంచి దేవర వచ్చింది. యావరేజ్ టాక్ అంటూనే 500 కోట్ల వరకు కలెక్షన్లు తెచ్చుకుంది ఈ మూవీ.

ఇక అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ ఇప్పటికే బిజినెస్‌తో 1000 కోట్లు సంపాదించింది. ఇప్పుడు ఈ రెండు సినిమాలను క్రాస్ చేసేలా గేమ్ ఛేంజర్ ఉండాలని రామ్ చరణ్ ఫ్యాన్స్‌తో పాటు మెగా అభిమానులు అనుకుంటున్నారు. అవన్నీ జరుగుతాయా లేదా అంటే… రాబోయే జనవరి 10వ తేదీ వరకు వెయిట్ చేయడం తప్పా.. చేసేదేమీ లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Abu obeida, a spokesperson fоr hаmаѕ’ѕ armed wіng, ѕаіd in a ѕреесh оn thе аnnіvеrѕаrу оf thе 7 october аttасk thаt thе. Latest sport news. 画『?.