అనిరుద్‌తో పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన కీర్తి సురేష్

keerthi anirudh

గత కొన్ని రోజులుగా కీర్తి సురేష్ – మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ మధ్య ప్రేమ కొనసాగుతుందని, త్వరలోనే ఈ ఇద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ ప్రచారం పై కీర్తి క్లారిటీ ఇచ్చింది.

‘నేను శైలజ’ మూవీ తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి.. తర్వాత ‘నేను లోకల్’, ‘మహానటి’, ‘అజ్ఞాత వాసి’, ‘దసరా’, ‘మిస్ ఇండియా’ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక ‘మహానటి’, ‘దసరా’ చిత్రాలకు అయితే అవార్డులు కూడా వచ్చాయి. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన అంద చందాలతో అదరహో అనిపిస్తుంది. ప్రస్తుతం రెండు మూడు ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉంది. ఈ క్రమంలో కీర్తి సురేష్‌ పెళ్లి వార్త వైరల్ గా మారింది.

గత రెండేళ్ల నుంచి హీరోయిన్ కీర్తి సురేష్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ప్రేమించుకుంటున్నారని, వీళ్లిద్దరు ప్రస్తుతం డేటింగ్ చేసుకుంటున్నారని, వచ్చే ఏడాది ప్రారంభంలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే పుకారు వైరల్ అవ్వడం తో కీర్తి క్లారిటీ ఇచ్చింది. ‘సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారాన్ని చూసి మా కుటుంబ సభ్యులు చాలా బాధపడ్డారు. నేను అనిరుద్‌తో ప్రేమలో లేను, అతినికి నాకు పెళ్లి జరగబోతుంది అంటూ సోషల్ మీడియాలో వినిపిస్తున్నది పూర్తిగా ఫేక్. నాకు అనిరుద్ మంచి స్నేహితుడు, అది మాత్రం ఒప్పుకుంటాను. ప్రస్తుతం నాకు పెళ్లి పై ఆసక్తి లేదు. నా దృష్టి మొత్తం కెరీర్ పైనే ఉంది’ అంటూ కీర్తి సురేష్ క్లారిటీ ఇచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Happy gifting, and may your office holiday party be filled with joy, laughter, and a touch of holiday magic !. Clínicas de recuperação para dependentes químicos e alcoólatras. す絵本とひみつ?.