యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన తాజా మూవీ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’. సప్త సాగరాలు దాటి సినిమా తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. నవంబర్ 08న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అప్పుడే ఓటీటీలోకి వచ్చేసింది. కరోనా కాలంలో పట్టాలెక్కిన ఈ మూవీ ఎన్నో అవాంతరాలు దాటి నవంబర్ 08న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆడియెన్స్ ను ఏ మాత్రం మెప్పించలేకపోయింది. ప్రమోషన్లు కూడా పెద్దగా నిర్వహించలేదు. నిఖిల్-రుక్మిణీల జోడీకి మంచి పేరొచ్చినప్పటికీ ఆకట్టుకునే కథ, కథనాలు సినిమాలో లేకపోవడంతో ఆడియెన్స్ పెదవి విరిచారు. ఫలితంగా స్పై సినిమా తర్వాత నిఖిల్ ఖాతాలో మరో ఫ్లాప్ చేరింది. థియేటర్లలో ఆడియెన్స్ ను నిరాశ పర్చిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమా ఇప్పుడు సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసింది. అది కూడా ఎలాంటి ప్రకటన లేకుండానే.ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో బుధవారం (నవంబర్ 27) అర్ధరాత్రి నుంచే నిఖిల్ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చేసింది.
ఈ సినిమా కాస్త విషయానికి వస్తే…
ఈ సినిమాకి కథతో పాటు అన్నీ లోపాలే. రిషి (నిఖిల్), తార (రుక్మిణి వసంత్), తులసి (దివ్యాన్షి కౌశిక్) మధ్య ముక్కోణపు ప్రేమకథ లాంటి కథ ఇది. ఇందులో థ్రిల్లర్ డ్రామాని కూడా ఇరికించారు. రిషి (nikhil siddhartha) రేసర్ కావాలని కలలు కంటాడు. ఆ ప్రయత్నంలో ఉండగా.. తార (Rukmini Vasanth)ను తొలిచూపులోనూ చూసి ప్రేమలో పడతాడు. ఆమె కూడా ఇతన్ని ప్రేమిస్తుంది కానీ.. ఇద్దరి మధ్య మిస్ కమ్యునికేషన్ వల్ల ప్రపోజ్ లేకుండానే బ్రేకప్ అవుతుంది. ఆ బాధలో ఉన్న రిషి.. తన లక్ష్యం కోసం లండన్ వెళ్తాడు. అక్కడ మనోడికి తులసి (Divyansha Kaushik) పరిచయం అవుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకూ వెళ్తాడు. అయితే చివరి క్షణంలో ఆ పెళ్లిని తప్పించుకుని వెళ్లిపోతుంది తులసి. సీన్ కట్ చేస్తే.. రిషి, తారలు మళ్లీ లవ్ ట్రాక్‌లోకి వస్తారు. ప్రపోజ్ చేసుకునే టైంకి మళ్లీ తులసి ఎంట్రీ ఇస్తుంది. తార ముందే రిషికి ఐలవ్యూ చెప్పడంతో.. తార మళ్లీ రిషికి దూరం అవుతుంది. ఇక తులసి.. రిషి గదిలో శవంగా కనిపిస్తుంది. ఆమె తులసి కాదు చుంబన అని తెలుసుకుంటాడు రిషి. ఆ చుంబన.. లండన్ డాన్ అయిన బద్రి నారాయణ (జాన్ విజయ్) దగ్గర ఐదొందల కోట్లు విలువ చేసే డివైస్‌ని కొట్టేస్తుంది. దాన్ని కాపాడుకునే ప్రయత్నంలోనే మళ్లీ రిషికి దగ్గరౌతుంది. అసలు తులసి ఎవరు? చుంబన ఎవరు? ఆ ఐదొందల కోట్లు విలువ చేసే డివైస్ ఎలా మిస్ అయ్యింది? అది ఎవరికి దొరికింది? చివరికి తార-రిషిలు ఏమయ్యారు అన్నదే సినిమా కథ. మరి థియేటర్స్ లలో పెద్దగా కట్టుకునేలోని ఈ మూవీ..ఓటిటి ప్రేక్షకులను ఎంతగా అలరిస్తుందనేది చూడాలి.