విడాకులఫై క్లారిటీ ఇచ్చిన అభిషేక్

abhi aish

ఐశ్వర్యరాయ్‌, అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకోబోతున్నారంటూ కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. నటి నిమ్రిత్‌కౌర్‌తో అభిషేక్ ఎఫైర్ కారణంగా ఐశ్వర్యతో విడిపోతున్నట్టు వార్తలొచ్చాయి. గత కొంతకాలంగా ఈ జంట మధ్య మనస్పర్ధలు తలెత్తాయని, వారు తమ వివాహబంధాన్ని తెంచు కోబోతున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. తాజాగా ఐశ్వర్య తన ముద్దుల కూతురు ఆరాధ్య బచ్చన్ పుట్టినరోజు వేడుకలలో అభిషేక్ కనిపించకపోవడంతో మరోసారి రూమర్స్ గుప్పుమన్నాయి

తన చుట్టూ అల్లుకున్న ఈ వార్తలపై అభిషేక్ తాజాగా స్పందించారు. విడాకుల వార్తలపై పరోక్షంగా స్పందించాడు. ప్రతికూల వార్తలను తాను పట్టించుకోబోనని తేల్చి చెప్పాడు. ‘ఈటీ టైమ్స్’తో మాట్లాడుతూ.. వ్యక్తిత్వంలో, మూలసిద్ధాంతంలో మనిషిగా మనం మారకూడదని, కానీ స్వీకరించడం, అభివృద్ధి చెందడాన్ని నేర్చుకోవాలని పేర్కొన్నాడు. లేదంటే వెనకబడిపోతామని చెప్పాడు. చెడు తన చెడును వదులుకోనప్పుడు.. మంచి మాత్రం తన మంచిని ఎందుకు వదులుకోవాలని ప్రశ్నిస్తూ పరోక్షంగా విడాకుల వార్తలను తప్పుబట్టాడు.

తాను చాలా సానుకూల వ్యక్తినని, ప్రతికూలతలపై దృష్టి పెడితే అది మిమ్మల్ని కబళిస్తుందని పేర్కొన్నాడు. మనిషిగా మీరెవరు? ఎందుకు కోసం ఉన్నారు? అనేది తెలుసుకోవాలని, నేను గాలికి ఆకులా కొట్టుకుపోతానంటే అతడు అంత గొప్పవాడు అనిపించుకోడని తెలిపాడు. అందుకనే తనలోని కొన్ని విషయాలు ఎప్పటికీ మారబోవని తేల్చి చెప్పాడు. మేఘంలోని వెండిరేఖను చూసినప్పుడో, సూర్యరశ్మిని చూసినప్పుడో దానిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తే అది మన జీవితాన్ని కొనసాగించేందుకు ప్రేరణ ఇస్తుందని అభిషేక్ చెప్పుకొచ్చాడు.

అభిషేక్ బచ్చన్‌, ఐశ్వర్యరాయ్ ల గురించి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. వీరి తమ కెరీర్ టాప్ లో ఉన్నప్పుడు 2007లో వివాహం చేసుకున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా ఆరాధ్య అనే పాప కూడా ఉంది. గత 16 ఏండ్లుగా వీరి వివాహా బంధం ఎంతో సంతోషంగా సాగుతోంది. అయితే.. గత కొంతకాలంగా వీరి మధ్య విభేదాలు చోటు చేసుకుంటున్నాయనీ, అభిషేక్- ఐశ్వర్యరాయ్ విడాకులు తీసుకుంటున్నారంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు ప్రచారం అవుతున్న తరుణంలో అభిషేక్ క్లారిటీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Safaricom’s half year profits dip amid ethiopian currency woes, increased capex. Construindo uma vida equilibrada após o tratamento : clínica de recuperação liberdade e vida para dependentes químicos. 「烏丸せつこ」タグ一覧 | cinemagene.