‘కస్టమర్ కేర్ మహోత్సవ్’ ను ప్రారంభించిన టాటా మోటార్స్

Tata Motors launched 'Customer Care Mahotsav'

·ఈ దేశవ్యాప్త కార్యక్రమం 23 అక్టోబర్ నుండి 24 డిసెంబర్ 2024 వరకు నిర్వహించబడుతుంది..
·యావత్ వాణిజ్య వాహనాల శ్రేణికి సంబంధించి వాహన తనిఖీలు, విలువ ఆధారిత సేవలు, డ్రైవర్ శిక్షణతో సహా మెరుగైన విక్రయానంతర అనుభవాన్ని అందించడం లక్ష్యం..

ముంబయి : వాణిజ్య వాహన వినియోగదారుల కోసం సమగ్ర కస్టమర్ ఎంగేజ్‌మెంట్ ప్రోగ్రామ్ అయిన ‘కస్టమర్ కేర్ మహోత్సవ్ 2024’ను ప్రారంభించినట్లు భారతదేశ అతిపెద్ద వాణిజ్య వాహన తయారీ సంస్థ అయిన టాటా మోటార్స్ ప్రకటిం చింది. ఈ కార్యక్రమం 2024 డిసెంబర్ 24 వరకు నిర్వహించబడనుంది. ప్రత్యేకమైన, విలువను పెంచే ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా 2500కి పైగా అధీకృత సర్వీస్ అవుట్‌లెట్‌లలో నిర్వహించబడనుంది. ఫ్లీట్ ఓనర్లు, డ్రైవర్‌లను కలిసి వారితో సంభాషించేందుకు, వారి అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఇది వీలు కల్పిస్తుంది. ఈ మహోత్సవ్ ద్వారా కస్టమర్లు శిక్షణ పొందిన సాంకేతిక నిపు ణులచే సంపూర్ణమైన వాహన తనిఖీలు చేయించుకోవచ్చు. విలువ ఆధారిత సేవలను పొందవచ్చు. ఇంకా మరెన్నో ప్రయోజనా లను పొందవచ్చు. అంతేగాకుండా డ్రైవర్లు సంస్థ సంపూర్ణ సేవా 2.0 కార్యక్రమం కింద తగిన ఆఫర్‌లతో పాటు సురక్షిత, ఇంధన-సమర్థవంత డ్రైవింగ్ పద్ధతులపై విస్తృత శిక్షణ పొందుతారు.

కస్టమర్ కేర్ మహోత్సవ్ 2024 ఎడిషన్‌ను ప్రారంభించిన సందర్భంగా టాటా మోటార్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ గిరీష్ వాఘ్ మాట్లా డుతూ.. ‘‘కస్టమర్ కేర్ మహోత్సవ్‌ను తిరిగి తీసుకుతీసుకువస్తున్నందుకు మేం సంతోషిస్తున్నాం. ఈ సంవత్సరం అక్టోబర్ 23న ఇది ప్రారంభమవుతుంది. మేం మా మొదటి వాణిజ్య వాహనాన్ని 1954లో ఇదే రోజున విక్రయించినందున ఈ రోజు మాకు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇప్పుడు మేం దానిని కస్టమర్ కేర్ డేగా నిర్వహించుకుంటున్నాం. కచ్చితత్వంతో కూడిన వాహన తనిఖీల ద్వారా మరియు అనేక రకాల ప్రయోజనాలను అందించడం ద్వారా అత్యుత్తమ-తరగతి సేవను అందించాలనే మా నిబద్ధతను ఈ మహోత్సవ్ ప్రతిబింబిస్తుంది. మహోత్సవ్ దేశంలోని ప్రతి టచ్‌పాయింట్‌లో మా కొనుగోలుదారులను ఆహ్లాద పరిచేలా చేయడం ద్వారా, మా వాటాదారులందరితోనూ మా సంబంధాలను బలోపేతం చేయాలని మేం లక్ష్యంగా పెట్టుకున్నాం. మేం మా కస్టమర్లందరినీ వారి సమీప టాటా అధీకృత సేవా కేంద్రాలకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమం వారి వ్యాపా రాలకు గణనీయమైన విలువను జోడిస్తుందని నేను విశ్వసిస్తున్నాను’’ అని అన్నారు.

టాటా మోటార్స్ విస్తృత వాణిజ్య వాహన పోర్ట్‌ఫోలియో ఇప్పుడు సంపూర్ణ సేవా 2.0 కార్యక్రమం ద్వారా సమగ్ర వాహన జీవితచక్ర నిర్వహణ కోసం రూపొందించబడిన విలువ-ఆధారిత సేవలను కూడా కలిగిఉంది. ఈ సమగ్ర పరిష్కారం వాహనం కొనుగోలుతో ప్రారంభమవుతుంది మరియు బ్రేక్‌డౌన్ అసిస్టెన్స్, గ్యారెంటీ టర్న్‌అరౌండ్ టైమ్స్, యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్‌లు (AMC) మరియు అసలైన విడిభాగాలకు అనుకూలమైన యాక్సెస్‌తో సహా వాహన జీవితచక్రంలోని ప్రతి కార్యాచరణ అంశానికి మద్దతు ఇస్తుంది. అంతేగాకుండా టాటా మోటార్స్ ఫ్లీట్ ఎడ్జ్, దీని కనెక్ట్ చేయబడిన వెహికల్ ప్లాట్‌ఫామ్‌ను ఫ్లీట్ గరిష్ట సద్వినియోగ నిర్వహణకు ఉపయోగిస్తుంది. ఆపరేటర్‌లు వాహనం నడిచే సమయాలను పెంచడానికి, యాజమాన్యం మొత్తం వ్యయాన్ని తగ్గించడానికి వీలు కల్పిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *