చైతూ-శోభిత పెళ్లి.. అదంతా పుకార్లే

chaitu weding date

నాగచైతన్య రెండో పెళ్ళికి సిద్దమైన సంగతి తెలిసిందే. సమంత ను ప్రేమించి పెళ్లి చేసుకున్న చైతు కొంతకాలానికే విడాకులు ఇచ్చారు. ఆ తర్వాత ఇద్దరు ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీ గా ఉన్నారు. ఇప్పుడు చైతు రెండో పెళ్లి కి రెడీ అయ్యాడు. నటి శోభిత ను పెళ్లి చేసుకోబోతున్నాడు. డిసెంబర్‌4వ తేదిన శోభితా దూళిపాళ్లతో చైతూ వివాహం జరగనుంది. పెళ్లి వార్త పాతదే అయినప్పటికి .. వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో తెగచక్కర్లు కొట్టింది.

ఇక పెళ్లి సమయం దగ్గర పడుతుండడం తో పెళ్లి కి సంబదించిన అనేక విషయాలు బయటకు వస్తూ అభిమానుల్లోఆసక్తి పెంచేస్తున్నాయి. కాగా నాగచైతన్య, శోభిత పెళ్లికి సంబంధించిన డిజిటల్ ప్రసార హక్కులను OTTకి విక్రయించినట్లు వస్తున్న వార్తలను అక్కినేని ఫ్యామిలీ సన్నిహిత వర్గాలు ఖండించాయి. ఈ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశాయి. తమ వివాహ వేడుకను ప్రైవేటుగా నిర్వహించాలని చైతూ-శోభిత నిర్ణయించుకున్నట్లు తెలిపాయి. డిసెంబర్ 4న జరగనున్న వీరి పెళ్లి ప్రసార హక్కులను నెటిక్కు రూ.50కోట్లకు విక్రయించినట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

అన్నపూర్ణ స్టూడియోలోనే వీరి వివాహానికి భారీ సెట్ ఏర్పాటు చేసి అక్కడ వివాహం జరిపించబోతున్నట్లు తెలుస్తోంది.మొత్తానికి అయితే అక్కినేని ఇంట కొత్త కోడలుగా శోభిత అడుగుపెట్టబోతోంది అని తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికేకొంత మంది స్నేహితులకు, బంధుమిత్రులకు వెడ్డింగ్ ఇన్విటేషన్స్‌ను పంపించడం మొదలుపెట్టారు. అక్కినేని వారి ఇంట ఆల్‌రెడీ పెళ్లి పనులు, పెళ్లి సందడి మొదలైందట. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చురుకుగా కొనసాగుతున్నాయని తెలిసింది. అటు శోభిత ధూళిపాళ ఇంట్లో కూడా పెళ్లి పనులు మొదలుపెట్టారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.

చైతు సినిమాల విషయానికి వస్తే..

ప్రస్తుతం నాగచైతన్య నటిస్తున్న ‘తండేల్‌’ చిత్రం నిర్మాణానంతర పనులను జరుపుకుంటోంది. ఫిబ్రవరి 7న చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌, బన్నీవాస్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సాయి పల్లవి కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Portfolios j alexander martin. By using the service, you agree to the collection and use of information in accordance with this privacy policy. While stealth mode gives you the chance to make a splash on launch day, it also comes with the risk of launching to silence.