హైదరాబాద్ ప్రజలకు ఆన్ లైన్ కెఫే అనుభవాన్ని అందించనున్న జెప్టో కెఫే

Zepto Cafe will provide an online cafe experience to the people of Hyderabad

●హైదరాబాదీలకు ఎంతో ఇష్టమైన క్విక్ బైట్స్ ను ఇప్పుడు నిమిషాల్లోనే అందించనున్న జెప్టో.
●జెప్టో యొక్క డార్క్ స్టోర్ నెట్‌వర్క్‌ ఇప్పుడు విపరీతంగా విస్తరిస్తోంది. కేవలం 15% మాత్రం విస్తరణతోనే.. జెప్టో కెఫే యూనిట్ ఇప్పటికే 160+ కోట్ల వార్షిక ఆదాయ రన్-రేట్‌ను సాధించింది.
●జెప్టో యొక్క డార్క్ స్టోర్‌ లలో 15% నుండి 100% వరకు కేఫ్‌ను స్కేల్ చేయడం ద్వారా, వచ్చే ఏడాది నాటికి కేఫ్‌ను 1,000 కోట్ల ఆదాయ వ్యాపారంగా మార్చేందుకు అవకాశం ఉంది. అలాగే జెప్టో ప్రస్తుతం నెలకు 100+ కేఫ్‌లను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

హైదరాబాద్: భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆన్ లైన్ డెలివరీ సంస్థ జెప్టో. ఇప్పటికే వినియోగదారులకు అత్యంత చేరువైన జెప్టో… 10 నిమిషాల డెలివరీ అనే కాన్సెప్ట్ ను ప్రవేశపెట్టి భారతీయ వినియోగదారులకు దగ్గరైంది. కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే ఫుడ్ మరియి పానీయాల్ని అత్యంత వేగంగా వినియోగదారులకు అందించిన జెప్టో… ఇప్పుడుడ తాజాగా హైదరాబాద్ లో జెప్టో కెఫేని ప్రారంభించింది. బలమైన వినియోగదారుల మద్దతు మరియు పెరుగుతున్న డిమాండ్‌తో, జెప్టో కెఫే ఇప్పుడు గేమ్-ఛేంజర్‌గా మారింది. అన్నింటికి మించి అత్యాధునిక సాంకేతికతతో సాంప్రదాయ రుచులను మిళితం చేసి కేఫ్ అనుభవాన్ని ప్రజల ఇంటి వద్దకు నేరుగా అందిస్తోంది జెప్టో.

ఈ సందర్భంగా జెప్టో సీఈఓ స్రీ ఆదిత్ పలిచ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ… భారతీయ వాణిజ్య విభాగంలో జెప్టో కెఫే సంచలనాలు సృష్టించడానికి సిద్ధంగా ఉంది. అన్నింటికి మించి అత్యుత్తమ నాణ్యత కలిగిన ఫుడ్ ని చాలా వేగంగా డెలివరీ చేయడమే మా అంతమ లక్ష్యం. మంచి నాణ్యత కలిగిన ఫుడ్ ని సకాలంలో అందించడం వల్లే మా 10 నిమిషాల ఫుడ్ డెలివరీ సూపర్ హిట్ అయ్యింది. వినియోగదారులకు మాపైన మరింత నమ్మకం పెరిగింది. మా బృందం గత ఏడాది నుంచి నిరంతరాయంగా మా కేఫ్‌ల కోసం ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ ఆహార తయారీ పరికరాలను గుర్తించి వాటిని తెచ్చి పెట్టుకుంది. టాప్-టైర్ జర్మన్ స్పీడ్ ఓవెన్‌ల నుండి భారతదేశంలోని అత్యుత్తమ ఆఫ్‌లైన్ కేఫ్ చెయిన్‌లలో కనిపించే సెమీ ఆటోమేటెడ్ కాఫీ మెషీన్‌ల వరకు అన్నింటిని సమకూర్చుకుని ఇప్పుడు వినియోగదారులకు నాణ్యతతో కూడిన ఫుడ్ ని అందిస్తోంది అని అన్నారు ఆయన.

హైదరాబాద్ లో జెప్టో కెఫే గురించి అదిత్ పలిచ మాట్లాడుతూ… “ ఆహారం, అభిరుచి అనగానే ప్రతీ ఒక్కరికీ హైదరాబాద్ గుర్తుకువస్తుంది. ఇక్కడి ప్రజల వారసత్వంలో ఆహారం అనేది ఒక భాగం. ఇక్కడి ప్రజలు ఎప్పటికప్పు కొత్త రుచుల్ని ఆస్వాదిస్తారు. ఇలాంటి మార్కెట్ లోకి మేం జెప్టో కెఫే ని పరిచయం చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. మా ప్లాట్‌ ఫారమ్‌ లోని ప్రతి 16 ఆర్డర్‌ లలో 1 సమోస ఆర్డర్. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇక్కడి ప్రజలు ఫుడ్ ని ఎంతగా ప్రేమిస్తారో. సమోసతో పాటు బన్ మస్కా, వియత్నామీస్ కోల్డ్ కాఫీ వంటి ఆధునిక పానీయాలను కూడా ఇక్కడ ప్రజలు ఆస్వాదిస్తున్నారు. సంప్రదాయకంగా ఇష్టమైనవి మరియు సరికొత్త రుచుల మధ్య ఈ సమతుల్యతే హైదరాబాద్ యొక్క డైనమిక్ పాక ల్యాండ్‌స్కేప్‌ను హైలైట్ చేస్తుంది. హైదరాబాదీల వేగవంతమైన జీవనశైలికి సరిపోయేలా వారసత్వం మరియు సౌలభ్యాన్ని సజావుగా మిళితం చేస్తూ జెప్టో కేఫ్ ఒక పరిపూరకరమైన అనుభవాన్ని అందిస్తుంది అని అన్నారు ఆయన.

హైదరాబాద్ స్పెసిఫిక్ ట్రెండ్స్:

●టాప్ ఐటెమ్స్: అన్నింటికంటే ఎక్కువగా ఆర్డర్ ఇచ్చేది సమోస. ఇది హైదరాబాద్ టాప్ సెల్లింగ్ స్నాక్. ప్రతీ 16 ఆర్డర్స్ లో ఇది కచ్చితంగా ఒకటి ఉండాల్సిందే.

●ప్రాంతీయ ప్రాధాన్యతలు: సమోస తర్వాత ఎక్కువమంది ఆర్డర్ ఇచ్చేది బన్ మస్కా. ప్రతీ 24 ఆర్డర్స్ 1 ఆర్డర్ కచ్చితంగా ఇది ఉంటుంది. సరళమైన మరియు సంతృప్తికరమైన ఆహారానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తారని ఆర్థం అవుతుంది.

●పానీయాలు: ఇక పానీయాల విషయానికి వస్తే… హైదరాబాదీ ప్రజలు వియత్నమీస్ కోర్డ్ కాఫీ తో పాటు అల్లం ఛాయ్ ను కూడా ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఆర్డర్స్ లో కూడా ఈ రెండే ఎక్కువగా ఉన్నాయి.

హైదరాబాదీ వినియోగదారులు ఏం ఆశిస్తున్నారు:

●ఎక్కువగా తాజాగా తయారు చేసిన 148 రకాల ఫుడ్ ఐటెమ్స్ ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అందులో బ్రూవుడ్ ఛాయ్, కాఫీ, స్నాక్స్, పేస్ట్రీస్ మరియు బ్రేక్ ఫాస్ట్ ఉన్నాయి.

●నిమిషాల్లో డెలివరీ, బిజీగా ఉన్న ప్రొఫెషనల్స్, కాలేజీ విద్యార్ధులు మరియు కుటుంబాలకు ఒకేలా అందించడం.

●యాప్ ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్డర్ చేసుకోవడం, అడుగడుగున సులభతరంగా ఫుడ్ ని బుక్ చేసుకోవడం.

జెప్టో కెఫే అభివృద్ధికి కారణాలు:

●ప్రాంతీయ అభివృద్ధిలో భాగంగా హైదరాబాద్ పై ఫోకస్ చేయడం, అన్నింటికి మించి కేవలం ఒక్క నెలలోనే 100కి పైగా కెఫేలను ప్రారంభించడం
●హైదరాబాద్, చెన్నై, పుణె సహా దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో వేగంగా విస్తరణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Consultants often travel to meet clients or work on site, offering plenty of opportunities to explore new places. Clínicas de recuperação para dependentes químicos e alcoólatras. イバシーポリシー.