టాలీవుడ్ నటుడు పెనుమత్స సుబ్బరాజు పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తన భార్యతో కలిసి బీచ్ ఒడ్డున దిగిన ఫోటో షేర్ చేశారు. పెళ్లి బట్టల్లో వారిద్దరు చూడ చక్కగా ఉన్నారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘Finally hitched’ అని పేర్కొన్నారు. అంటే తనకు పెళ్లి అయినట్టు కన్ఫర్మేషన్ ఇచ్చారు. అంతే తప్ప… తాను పెళ్లి చేసుకున్నది ఎవరిని? ఎప్పుడు ఏడు అడుగులు వేశారు? వంటి వివరాలు ఏమి చెప్పలేదు. నటుడు ‘వెన్నెల’ కిశోర్ సహా కొంత మంది ఇండస్ట్రీ ప్రముఖులు ఆయనకు కంగ్రాట్స్ తెలుపుతూ వస్తున్నారు.
గత కొన్నాళ్లుగా సుబ్బరాజు ప్రేమలో ఉన్నారు. ఆయనది లవ్ మ్యారేజ్. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? అంటే… అమెరికాలో సెటిల్ అయిన ఓ తెలుగు ఫ్యామిలీలో జన్మించిన అమ్మాయి. ఇండియన్ ఆరిజన్ అయినా సరే… పుట్టింది, పెరిగింది అమెరికాలో అని ఫిలిం నగర్ వాసులు అంటున్నారు. గతంలో ఎన్నో ఇంటర్వ్యూల్లో పెళ్లి ఎప్పుడు అనే ప్రస్తావన రాగా.. తనకు ఆసక్తి లేదంటూ సుబ్బరాజు చెప్పేవారు. అయితే.. ఎట్టకేలకు 47 ఏళ్ల వయసులో ఓ ఇంటివాడు అయ్యాడు. ఎలాంటి హడావుడి లేకుండా చాలా సింపుల్‌గా పెళ్లి చేసుకున్నట్లుగా తెలుస్తోంది. కృష్ణ వంశీ దర్శకత్వంలో ఖడ్గం మూవీతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు సుబ్బరాజు. ఆ మూవీలో ఓ చిన్న పాత్రలో ఆయన కనిపించారు. అయితే.. ఈ అవకాశం అనుకోకుండా సుబ్బరాజుకు వచ్చింది. దర్శకుడు కృష్ణ వంశీ కంప్యూటర్ రిపేర్ కోసం వెళ్లిన ఆయనకు అనుకోకుండా మూవీలో ఛాన్స్ వచ్చింది. ఆ తరువాత తమిళ అమ్మాయి చిత్రంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో ఆయన ఇక వెనుదిరిగి చూడాల్సి న పని లేకుండా పోయింది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా, కమెడియన్‌గా నటించి అభిమానుల్లో చెదరని ముద్ర వేశారు. ప్రస్తుతం తెలుగు తో పాటు అనేక భాషల్లోసినిమాలు చేస్తూ బిజీ గా ఉన్నారు. ఇక ఇప్పుడు పెళ్లి చేసుకొని మరింత బిజీ గా మారాడు.