నాగచైతన్య, శోభితల పెళ్లి కార్డు అదిరిపోయింది..

chaitu shobitha wedding car

నాగచైతన్య రెండో పెళ్ళికి సిద్దమైన సంగతి తెలిసిందే. సమంత ను ప్రేమించి పెళ్లి చేసుకున్న చుట్టు కొంతకాలానికే విడాకులు ఇచ్చారు. ఆ తర్వాత ఇద్దరు ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీ గా ఉన్నారు. ఇప్పుడు చైతు రెండో పెళ్లి కి రెడీ అయ్యాడు. నటి శోభిత ను పెళ్లి చేసుకోబోతున్నాడు. డిసెంబర్‌4వ తేదిన శోభితా దూళిపాళ్లతో చైతూ వివాహం జరగనుంది. పెళ్లి వార్త పాతదే అయినప్పటికి .. వెడ్డింగ్ కార్డ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. టాలీవుడ్ స్టార్ హీరో కొడుకు పెళ్లి శుభలేఖ అంటే ఎంతో గ్రాండ్‌గా ఉండాలి. కాని నాగచైతన్య, శోభితాల వెడ్డింగ్ కార్డ్ చాలా సింపుల్‌గా , ట్రెడిషనల్‌గా ఆకట్టుకునేలా ఉంది. నాగ చైతన్య వెడ్డింగ్ కార్డులో డిసెంబర్ 4వ తేది వివాహం అని ముద్రించారు. వధువరుల తల్లిదండ్రుల పేర్లతో పాటు నాగచైతన్య తాతయ్య అక్కినేని నాగేశ్వరరావు, అన్నపూర్ణమ్మ పేర్లు కూడా ఉన్నాయి. కాకపోతే వెడ్డింగ్ ఇన్విటేషన్‌లో ముహుర్తం సమయం లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది.

అన్నపూర్ణ స్టూడియోలోనే వీరి వివాహానికి భారీ సెట్ ఏర్పాటు చేసి అక్కడ వివాహం జరిపించబోతున్నట్లు తెలుస్తోంది.మొత్తానికి అయితే అక్కినేని ఇంట కొత్త కోడలుగా శోభిత అడుగుపెట్టబోతోంది అని తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికేకొంత మంది స్నేహితులకు, బంధుమిత్రులకు వెడ్డింగ్ ఇన్విటేషన్స్‌ను పంపించడం మొదలుపెట్టారు. అక్కినేని వారి ఇంట ఆల్‌రెడీ పెళ్లి పనులు, పెళ్లి సందడి మొదలైందట. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చురుకుగా కొనసాగుతున్నాయని తెలిసింది. అటు శోభిత ధూళిపాళ ఇంట్లో కూడా పెళ్లి పనులు మొదలుపెట్టారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.

చైతు సినిమాల విషయానికి వస్తే..

ప్రస్తుతం నాగచైతన్య నటిస్తున్న ‘తండేల్‌’ చిత్రం నిర్మాణానంతర పనులను జరుపుకుంటోంది. ఫిబ్రవరి 7న చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌, బన్నీవాస్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సాయి పల్లవి కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Biznesnetwork – where african business insights brew !. Prevenção de recaídas na dependência química : dicas da clínica de recuperação para dependentes químicos liberdade e vida. レコメンド.