హీరోయిన్ కు ఫౌజీ నిర్మాతల కండిషన్స్

imanvi

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా మూవీస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సెట్స్ పై కల్కి 2 , స్పిరిట్ , రాజాసాబ్ తో పాటు హనురాఘవాపుడి డైరెక్షన్లో ఫౌజీ చేస్తున్నాడు. ఈ మధ్యనే ఈ మూవీ ప్రారంభోత్సం మొదలుపెట్టుకొని , షూటింగ్ ను స్టార్ట్ చేసారు. ఈ పాన్ ఇండియా మూవీ లో ప్రభాస్ సరసన నటి ఇమాన్వి ఇస్మాయిల్‌ ఎంపిక చేసారు. అన్ని స్క్రీన్ టెస్టులు, పాత్రకు సరిపోయే లుక్స్, పెర్ఫార్మెన్స్ పరీక్షించి చివరికి ఇమాన్విని సెలెక్ట్ చేశారు. ఇక ఫౌజీ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. తమిళనాడులో ముఖ్యమైన సన్నివేశాలను దర్శకుడు హను రాఘవపూడి చిత్రీకరించారు. ప్రభాస్ డేట్స్ 2025 సంక్రాంతి తర్వాత అందుబాటులోకి వస్తాయని సమాచారం. అయితే ఇమాన్వి కి ఇప్పటివరకు అనేక పాన్ ఇండియా చిత్రాల నుంచి ఆఫర్స్ వచ్చాయట. కానీ ఆమె దేనికి కూడా ఒప్పుకోవడం లేదట. దానికి ప్రధాన కారణం ఫౌజీ నిర్మాతలు పెట్టిన కండిషన్స్ అని తెలుస్తుంది.

ప్రస్తుతం ప్రభాస్ బిజీ షెడ్యూల్స్ కారణంగా షూటింగ్ లోకి ఎప్పుడు వస్తాడో తెలియని పరిస్థితి. కాబట్టి హీరోయిన్ డేట్స్ విషయంలో ఇబ్బందులు రాకూడదని ముందే ఫిక్స్ అయ్యారు. ప్రస్తుత పెద్ద హీరోయిన్లు డేట్స్ అడ్జస్ట్ చేయడం కష్టమని, అందుకే కొత్త నటి ఇమాన్విని తీసుకోవాలని మైత్రీ మూవీ మేకర్స్ మొదట్లోనే నిర్ణయం తీసుకున్నారట. ఈ కారణంగా ఇమాన్వితో ఏడాది కాలం పాటు కాల్ షీట్స్ బ్లాక్ చేసుకున్నారట. ప్రత్యేకంగా, ఆమెకు బిజినెస్ క్లాస్ ప్రయాణం, 5-స్టార్ హోటల్ విడిది వంటి సౌకర్యాలను కూడా అందించబోతున్నారని తెలుస్తోంది. ఇమాన్వి అమెరికాలో నివసిస్తున్న నేపథ్యంలో ఆమె ప్రాజెక్ట్ కోసం ఎప్పుడైతే ప్రభాస్ షూటింగ్ షెడ్యూల్ కి డేట్స్ అందుబాటులో ఉంటాయో, అప్పుడు వెంటనే రప్పించేలా ఏర్పాట్లు చేసారు. ఇమాన్వీది ఢిల్లీ. డ్యాన్స్ ప‌ట్ల ఉన్న ఇష్టం వ‌ల్ల ఉన్న‌త చ‌దువులు చ‌దివినప్ప‌టికీ డ్యాన్స్ ను వ‌దులుకోకుండా ఎప్పుడూ ప్రాక్టీస్ చేస్తూ కొత్త స్టైల్స్ ను క‌నిపెట్ట‌డానికి క‌ష్ట‌ప‌డేది.

ఇమాన్వీ ఇంట్రెస్ట్ ను తెలుసుకున్న తండ్రి ఆమెను ప్రోత్స‌హించి యూట్యూబ్ ఛానెల్ పెట్టించాడు. దీంతో జాబ్ కు రిజైన్ చేసి మ‌రీ ఇమాన్వీ డ్యాన్స్ పై ఫోక‌స్ పెట్టి ఫుల్ టైమ్ డ్యాన్స‌ర్ గా మారింది. రీల్స్, ఈవెంట్స్ చేస్తూ డ్యాన్సే త‌న ప్ర‌పంచంగా ఉండిపోయింది. ఇమాన్వీ తండ్రి మాత్ర‌మే కాదు త‌న త‌ల్లి కూడా ఆమెను ఎంతో ప్రోత్సహించింది. ఎక్స్‌ప్రెష‌న్స్ విష‌యంలో ఇంకా ఎలా కొత్త‌ద‌నం తీసుకురావ‌చ్చ‌ని త‌న తల్లి ఎంతో ఉత్తేజ‌ప‌రిచేది. అలా ఇన్‌స్టాలో ఫేమ‌స్ అయిన ఇమాన్వీ, హ‌ను దృష్టిలో ప‌డి ఇప్పుడు ప్ర‌భాస్ ప‌క్క‌న న‌టించే ఛాన్స్ కొట్టేసింది. పీరియాడిక్ ఫిల్మ్ అంటున్నారు కాబ‌ట్టి హీరోయిన్ క్యారెక్ట‌ర్ కు మంచి ప్రాధాన్య‌తే ఉంటుంది. దానికి తోడు హ‌ను త‌న మొద‌టి సినిమా నుంచి ప్ర‌తీ సినిమాలోనూ హీరోయిన్ పాత్ర‌కు ఎంతో ప్రాధాన్యం ఇస్తాడు. ఇప్పుడు ఇమాన్వీకి కూడా ఈ సినిమాతో మంచి పాత్ర ఇచ్చి ఆమె కెరీర్ ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్ల‌నున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whаt wіll іt tаkе tо turn the tіdе ?. Latest sport news. 【?.