మహదేవ్‌ శాస్త్రిగా మోహన్‌ బాబు

mohan babu kannappa

కన్నప్ప 2024లో రూపొందుతున్న తెలుగు సినిమా. ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై డాక్టర్‌ మోహన్‌బాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు ముఖేశ్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. విష్ణు మంచు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే సినిమాలోని పలు పాత్రలను పరిచయం చేసిన డైరెక్టర్ తాజాగా మోహన్‌ బాబు లుక్ షేర్ చేశాడు. ఇందులో మహదేవ్‌ శాస్త్రిగా కనిపించనున్నట్టు తెలియజేస్తూ ప్రీ లుక్‌ విడుదల చేశారు. ఫుల్ లుక్‌ను నవంబర్ 22న లాంచ్ చేయనున్నట్టు తెలియజేశారు. ఇందులో మోహన్‌ బాబు పాత్ర చాలా పవర్ ఫుల్‌గా ఉండబోతున్నట్టు ప్రీ లుక్‌ చూస్తే అర్ధం అవుతుంది. ఇప్పటికే కన్నప్ప నుంచి లాంచ్‌ చేసిన టీజర్‌, పోస్టర్లు నెట్టింట చక్కర్లు కొడుతూ.. సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి.

ఇక కన్నప్ప నుంచి తిన్నడు, ముండడు, చండుడు, మారెమ్మ, పిలక-గిలక పాత్రలకు సంబంధించిన పోస్టర్లు విడుదల చేయగా.. స్టిల్స్ ఆన్‌లైన్‌లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్‌ అక్షయ్‌కుమార్‌ శివుడిగా కనిపించబోతున్నాడు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ, స్టీఫెన్‌ దేవసి మ్యూజిక్, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నారు.ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ, Ava Entertainment బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీకి పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయిమాధవ్‌, తోట ప్రసాద్‌ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

With businesses increasingly moving online, digital marketing services are in high demand. Prevenção de recaídas na dependência química : dicas da clínica de recuperação para dependentes químicos liberdade e vida. Cinemagene編集部.