కిరణ్ అబ్బవరం ‘క’ 18 రోజుల కలెక్షన్స్

ka collections

కిరణ్ అబ్బవరం నటించిన ‘క’ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుంది. కథలో దమ్ము ఉంటె ప్రేక్షకులు బ్రహ్మ రథం పడతారని మరోసారి క మూవీ నిరూపించింది. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా, ఫుల్ రన్ లో కచ్చితంగా 50 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టేలా ఉంది. ఈ సినిమాతో పాటు ‘లక్కీ భాస్కర్’, ‘అమరన్’ వంటి సినిమాలు కూడా ఒకే రోజున విడుదల అయ్యాయి. ఆ రెండు కూడా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్నాయి. అయినప్పటికీ క కలెక్షన్లు ఎక్కడ డ్రాప్ కాకుండా కొనసాగుతున్నాయి.

ముఖ్యంగా నైజాం ప్రాంతంలో 18 రోజులకు 5 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, సీడెడ్ ప్రాంతంలో 2 కోట్ల 82 లక్షల రూపాయిలు షేర్ వసూళ్లు, కోస్తాంధ్ర లో 7 కోట్ల 85 లక్షల రూపాయిలను రాబట్టింది. అలా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 16 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా కి కలిపి కోటి రూపాయిల షేర్, ఓవర్సీస్ లో 3 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు రాబట్టాయి.

కిరణ్ అబ్బవరం కి మొదటి నుండి భారీ మార్కెట్ లేకపోవడం వల్ల ఓవర్సీస్, రెస్ట్ ఆఫ్ ఇండియా, కర్ణాటక వంటి ప్రాంతాలలో ఓపెనింగ్స్ దగ్గర నుండే వసూళ్లు ఆశించిన స్థాయిలో రాలేదు. ఓవరాల్ గా 18 రోజులకు కలిపి ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల 21 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు, 38 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చింది. ఇది నిజంగా కిరణ్ అబ్బవరం రేంజ్ కి భారీ వసూళ్లే కానీ, మొదటి వీకెండ్ లో ఉన్నటువంటి ఊపు ని చూసి, కచ్చితంగా 50 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబడుతుందని అనుకున్నారు. కానీ ఆ మేరకు వస్తారా రావా అనేది కాస్త సందేహం గా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Ghana launches mycredit score to improve access to credit and boost financial inclusion biznesnetwork. Clínicas de recuperação para dependentes químicos e alcoólatras. 画ニュース.