విశ్వక్ ‘మెకానిక్ రాకీ’ ప్రీరిలీజ్ ఈవెంట్

mechanic rocky pre release

టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోస్ లో విశ్వక్సేన్ ఒకడు. వెళ్ళిపోమాకే సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు విశ్వక్. ఈ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. చాలామందికి ఈ సినిమా వచ్చిందని కూడా తెలియకుండా పోయింది. ఇకపోతే తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ నగరానికి ఏమైంది సినిమా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ సినిమా తర్వాత ఫలక్నామా దాస్ అనే సినిమాతో తనలో ఉన్న దర్శకత్వ ప్రతిభను కూడా బయటికి తీసాడు విశ్వక్. ఇక ప్రస్తుతం విశ్వక్సేన్ మెకానిక్ రాకీ అనే సినిమాను చేసాడు.

మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఇప్పటికే విడుదలై, ప్రేక్షకులలో మంచి ఆసక్తిని రేకెత్తించింది. రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రామ్ తాళ్లూరి ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 22న రిలీజ్ కానుంది. ఈక్రమంలో మేకర్స్ గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. రేపు (నవంబర్ 17) వరంగల్ హనుమకొండలోని JNSW ఇండోర్ స్టేడియంలో ఈవెంట్ జరగనుంది. సాయంత్రం 5 గంటల నుంచి ఈవెంట్ ప్రారంభమవుతుందని మేకర్స్ తెలియజేస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

But іѕ іt juѕt an асt ?. Stuart broad truly stands as a force to be reckoned with in the world of test cricket. 合わせ.