పుష్ప 2 ట్రైలర్ తోనే ఈ రేంజ్ రికార్డ్స్ సృష్టిస్తుంటే..సినిమా ఏ రేంజ్ లో రికార్డ్స్ సృష్టిస్తుందో అని ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. అల్లు అర్జున్ – సుకుమార్ కలయికలో తెరకెక్కిన పుష్ప 2 డిసెంబర్ 05 న పాన్ ఇండియా గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీ పై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదు. ఇక సినిమా రిలీజ్ దగ్గర పడుతుండడం తో మేకర్స్ ప్రమోషన్ కార్య క్రమాలు స్పీడ్ చేశారు. నిన్న ఆదివారం ఈ మూవీ ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని పాట్నా లో అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ తో పాటు హీరోయిన్ రష్మిక , పలువురు చిత్ర యూనిట్ పాల్గొన్నారు. ఈ వేడుక భారీ సక్సెస్ కావడమే కాదు అల్లు అర్జున్ రేంజ్ ఏంటో నేషనల్ మొత్తం మాట్లాడుకునేలా చేసింది.
ఇక ట్రైలర్ విషయానికి వస్తే..మాటల్లో చెప్పలేం..పుష్ప రేంజ్ ఏంటో సినిమాలో చూడాలసిందే అని అనుకునేలా కట్ చేసారు. పుష్ప అంటే ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ , పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్ నేషనల్ అంటూ బన్నీ చెపుతున్న ఒక్కో డైలాగ్ కు వెట్రుకలు నిక్కబొడుతున్నాయి. ఈ ట్రైలర్ చూసిన అభిమానులు , సినీ ప్రముఖులు తమ స్పందనను తెలియజేస్తూ వస్తున్నారు. దీంతో యూట్యూబ్ లో ట్రైలర్ రికార్డు వ్యూస్ నెలకొల్పుతుంది. ఇప్పటికే పలు రికార్డ్స్ బ్రేక్ చేయగా…తాజాగా మరో రికార్డు నెలకొల్పింది.
ఇప్పటివరకు మహేష్ బాబు ‘గుంటూరు కారం’, ప్రభాస్ ‘సలార్’ సినిమా ట్రైలర్లు సాధించిన రికార్డులను కూడా బ్రేక్ చేస్తూ.. ఆల్ టైం రికార్డ్ సృష్టించింది పుష్ప-2 ట్రైలర్ అన్ని భాషలవారీగా భారీ వ్యూస్ రాబట్టింది. ఆ వ్యూస్ చూస్తే..24 గంటల్లో దేశ వ్యాప్తంగా అన్ని భాషల్లో పుష్ప 2 ట్రైలర్ కి 105.9 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
తెలుగు – 44.8 మిలియన్ వ్యూస్..
హిందీ – 51 మిలియన్ వ్యూస్..
తమిళ్ – 5.3 మిలియన్ వ్యూస్..
మలయాళ – 1.9 మిలియన్ వ్యూస్..
కన్నడ – 1.9 మిలియన్ వ్యూస్..
బెంగాలీ – 1 మిలియన్ వ్యూస్ అందుకుంది. ఇలా మొత్తానికైతే అన్ని భాషలలో కూడా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది.