పుష్ప-2 సినిమా నుంచి విడుదలైన ‘కిస్సిక్’ సాంగ్ ఆల్ టైమ్ రికార్డు సృష్టించినట్లు మేకర్స్ వెల్లడించారు. 24 గంటల్లో ఇండియాలోనే అత్యధిక వ్యూస్ సాధించిన లిరికల్ వీడియోగా నిలిచినట్లు తెలిపారు. మొత్తంగా 42+ మిలియన్ వ్యూస్ నమోదు అయ్యాయని , యూట్యూబ్లో ట్రెండింగ్-1గా కొనసాగుతోందని పేర్కొంటూ ఓ పోస్టర్ను మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
రీసెంట్ గా సినిమా నుండి వచ్చిన మోస్ట్ అవైటెడ్ ఐటెం సాంగ్ అయిన కిస్సిక్(#KISSIK (#Pushpa2TheRule) సాంగ్, ఓవరాల్ గా పుష్ప లోని ఊ అంటావా సాంగ్ రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకోక పోయినా కూడా ఓవరాల్ గా మంచి రీచ్ ను సాధించింది. లైక్స్ పరంగా కొత్త రికార్డులు ఏమి నమోదు అవ్వలేదు కానీ వ్యూస్ పరంగా మాత్రం టాలీవుడ్ రికార్డుల బెండు తీసిన ఈ సాంగ్ తర్వాత సౌత్ రికార్డులను కూడా బ్రేక్ చేసి అప్ కమింగ్ లిరికల్ సాంగ్స్ కి ఇప్పుడు బిగ్గెస్ట్ టార్గెట్ ను సెట్ చేసి పెట్టింది అని చెప్పాలి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ప్రముఖ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం పుష్ప-2. ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలతో పుష్ప-2పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

#KissikSong is on a RECORD BREAKING SPREE and sets an ALL TIME RECORD 💥💥#Kissik becomes the INDIA'S HIGHEST VIEWED LYRICAL SONG in 24 hours with 42 MILLION+ VIEWS ❤️🔥

TRENDING #1 on YouTube 📸
▶️ https://t.co/Us61GBJHP1

An Icon Star @alluarjun & Dancing Queen @sreeleela14… pic.twitter.com/L9kilQAf5z
— Pushpa (@PushpaMovie) November 25, 2024