ఈ నెల 22 నుండి చరణ్ కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం

charan new movie

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమా ప్రమోషన్స్‌లలో బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల లక్నోలో ఈ చిత్రం టీజర్‌ విడుదల వేడుకలో ఆయన పాల్గొన్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని ప్రమోషన్స్‌ టూర్స్‌ను ప్లాన్‌ చేశారు మేకర్స్‌. శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. దిల్ రాజు నిర్మాత. సంక్రాంతి కానుకగా జనవరి 10న ‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా విడుదలకు ముందే రామ్‌చరణ్‌ తన తదుపరి చిత్రం చిత్రీకరణ షూటింగ్‌లో పాల్గొన్నబోతున్నాడు. ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సాన దర్శకత్వంలో చరణ్‌ నటిస్తున్న తాజా చిత్రం చిత్రీకరణ ఈ నెల 22 నుండి మైసూర్‌లో ప్రారంభం కాబోతుంది.

ఈ తొలిషెడ్యూల్‌లో హీరో రామ్ చరణ్‌, హీరోయిన్‌ జాన్వీకపూర్‌తో పాటు చిత్రంలో ఇతర ముఖ్య పాత్రదారులు పాల్గొనబోతున్నట్లు తెలుస్తుంది. కొంత టాకీతో పాటు ఓ యాక్షన్‌ సన్నివేశాన్ని కూడా ఇక్కడ షూట్‌ చేస్తారని సమాచారం. రత్నవేలు డైరెక్టర్‌ ఆఫ్‌ ఫోటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్‌ సంగీత దర్శకుడు ఏఆర్‌. రెహమాన్‌ మ్యూజిక్ అందిస్తున్నారు. వృధ్ధి సినిమాస్‌ పతాకంపై కిలారు సతీష్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ పాత్ర ఎంతో వైవిధ్యంగా, మునుపెన్నడూ చూడని విధంగా ఉంటుందట. ముఖ్యంగా దర్శకుడు బుచ్చిబాబు చరణ్‌ పాత్రను డిజైన్‌ చేసిన విధానం గొప్పగా ఉంటుందని ఫిలిం నగర్ టాక్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Truecaller appoints ogochukwu onwuzurike as country manager for nigeria biznesnetwork. Estratégias de sucesso para prevenir recaídas na clínica de recuperação para dependentes químicos. 注?.