టాలెంట్‌లో తగ్గేదేలే అంటోన్న మహేష్ ఫ్యాన్స్.. ఎస్ఎస్ఎంబి29 యూనిక్ పోస్టర్ అదుర్స్

ssmb29

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోయే “SSMB 29” (వర్కింగ్ టైటిల్) సినిమా కోసం భారీగా ఆసక్తి నెలకొంది ప్రస్తుతానికి ఈ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉండగా అభిమానులు కొత్త అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చిత్రానికి సంబంధించిన శృతిప్రతిపాదిత వివరాలు బయటకు రానప్పటికీ సినిమా జోనర్ పై సస్పెన్స్ కొనసాగుతోంది మహేష్ అభిమానులు మాత్రం ఆయన లుక్ ఎలా ఉంటుందా అని ఊహాగానాల్లో మునిగిపోయి తమ సృజనాత్మకతను సోషల్ మీడియాలో ప్రదర్శిస్తున్నారు ఇటీవల ఒక అభిమాని రూపొందించిన ఫ్యాన్ మేడ్ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఈ పోస్టర్ రాజమౌళి మరియు మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాకు సంబంధించిన అనేక ఊహాగానాలను స్ఫూర్తి చేస్తోంది పోస్టర్ చూస్తే మహేష్ బాబు స్టైలిష్ గెటప్ లో అఫ్రికన్ అడవుల నేపథ్యంతో ఒక సాహస యాత్రికుడి పాత్రలో ఉన్నట్లు కనిపిస్తారు ఆట మొదలైంది వేట కొనసాగుతుంది అనే స్లోగన్‌తో అభిమానుల ఊహలను మరింత ప్రేరేపించేలా తయారవడం విశేషం

రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రం “ఇండియానా జోన్స్” తరహాలో అఫ్రికన్ అడవులను ఆధారంగా చేసుకుని రూపొందుతుందని ఇది ఒక యాక్షన్ అడ్వెంచర్ గా ఉంటుందని గతంలో వెల్లడించారు రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్‌లో ఇది మొదటి సినిమా కాబట్టి అభిమానుల అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ సినిమాలో మహేష్ బాబు ఒక సాహసోపేత పాత్రలో కనిపిస్తారని టాక్ ఉంది అతని లుక్ కూడా ఈ కొత్త పాత్రకు ప్రత్యేకంగా రూపొందించబడుతుందని సమాచారం ఇప్పటి వరకు అధికారికంగా సినిమాకు సంబంధించిన ఏది బయటకు రాకపోయినా అభిమానులు మాత్రం ఇప్పటికే మహేష్ బాబుని తలుచుకొని వైవిధ్యమైన పోస్టర్లు రూపొందిస్తున్నారు ముఖ్యంగా ఒక అభిమాని తయారు చేసిన పోస్టర్ ఇప్పుడు నెట్టింట్లో బాగా వైరల్ అవుతోంది. ఇందులో మహేష్ బాబు గుర్రంపై కూర్చొని, క్యాప్ ధరించి గుబురు గడ్డం లాంగ్ హెయిర్ మరియు వెనుక బ్యాగ్ తగిలించుకుని సాహసయాత్రలో ఉన్నట్టు చూపించబడ్డారు ఈ పోస్టర్ చూసి చాలామందికి ఇది అధికారికంగా మేకర్స్ విడుదల చేసినదని అనిపించినంత నాణ్యతతో ఉంది.

ఈ సినిమాలో మహేష్ బాబు పూర్తిగా కొత్త మేకోవర్‌తో కనిపించనున్నారని సమాచారం గుబురు గడ్డం పొడవాటి జుట్టు రఫ్ లుక్‌లో ఆయన పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని అనుకుంటున్నారు రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా కోసం మహేష్ బాబు తన స్టైలింగ్ ఫిజిక్ పై కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు “SSMB 29” సినిమా షూటింగ్ 2025 జనవరిలో ప్రారంభం కానుందని సమాచారం సినిమా భారీ స్థాయిలో తెరకెక్కబోతుండటంతో ఇది మహేష్ బాబు కెరీర్‌లో మరో మైలురాయి కావచ్చని అభిమానులు ఆశిస్తున్నారు ఈ ప్రాజెక్ట్ మహేష్ బాబు మరియు రాజమౌళి కాంబినేషన్ పై ఉన్న అంచనాలు ఇప్పటికే స్కై హైగా ఉన్నాయి ఈ ఫ్యాన్ మేడ్ పోస్టర్ చూసిన అభిమానులు “SSMB 29” పై మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు “యాక్షన్ అడ్వెంచర్” నేపథ్యంతో సూపర్ స్టార్ మహేష్ బాబుని మరో అద్భుతమైన పాత్రలో చూడటానికి అందరూ ఆతురతతో ఎదురుచూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *