వ్యూహాత్మక రీబ్రాండ్, గ్లోబల్ విస్తరణను ప్రారంభించిన పోసిడెక్స్ టెక్నాలజీస్

Posidex Technologies embarks on strategic rebrand global expansion

హైదరాబాద్: భారతదేశంలో కస్టమర్ మాస్టర్ డేటా మేనేజ్‌మెంట్ సొల్యూషన్స్ ప్రముఖ ప్రొవైడర్ పోసిడెక్స్ టెక్నాలజీస్ ప్రై.లి. వ్యూహాత్మక రీబ్రాండ్‌ను ఆవిష్కరించడంతో పాటు ప్రపంచ విస్తరణకు సంబంధించి తన ప్రణాళికలను ప్రకటించింది. కొత్త లోగోను శ్రీ పీవీ సింధు ఆవిష్కరించారు. పరిశ్రమ ప్రము ఖులు, పోసిడెక్స్ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ పీవీ సింధు మాట్లాడుతూ..‘‘సంస్థ అందించే పరిష్కారాలు, ఉత్పత్తుల గురించి నాకు వివ రించారు. అవి ప్రజలను ఎంత ప్రభావవంతంగా ప్రభావితం చేస్తాయో చూడటం మనసును కదిలించింది. తెర వెనుక, తరచుగా ప్రజలు కూడా గుర్తించని విధంగా వారి రోజువారీ జీవితాన్ని పోసిడెక్స్ సులభతరం చేస్తోం ది. వ్యక్తిగత డేటాను భద్రపరచడం, కచ్చితమైన కస్టమర్ ఇన్ సైట్స్ ను అందించడం లేదా వ్యాపార సంస్థలు తమ కొనుగోలుదారులను మెరుగ్గా అర్థం చేసుకోవడంలో సహాయపడటం వంటివి…ఇలా ఏది చేసినా, ఈ సాంకేతికత బయటకు కనిపించకపోయినప్పటికీ అది ప్రజల, వ్యాపార సంస్థల రోజువారీ చర్యలలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది’’ అని అన్నారు.

రెండు దశాబ్దాలుగా పోసిడెక్స్ బ్యాంకింగ్, బీమా, కన్స్యూమర్ ఫైనాన్స్, హౌసింగ్ ఫైనాన్స్, రిటైల్, క్యాపిటల్ మార్కెట్లు, ప్రభుత్వం వంటి రంగాలలో అనేక ఫార్చ్యూన్ 500 కంపెనీలతో సహా 60కి పైగా ప్రధాన సంస్థలకు సాధికారికత అందించింది. పోసిడెక్స్ అధునాతన కస్టమర్ డేటా మేనేజ్‌మెంట్ మరియు నిజ-సమయ సంద ర్భోచిత అంతర్దృష్టులు క్లయింట్‌లు అధిక పోటీ వాతావరణంలో వృద్ధి చెందడానికి వీలు కల్పించాయి.
పోసిడెక్స్ ప్రస్తుతం భారతదేశంలోని 9 అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్‌లలో 7 బ్యాంక్ లకు, ప్రముఖ 15 ఎన్ బీఎఫ్ సీ లలో 9 సంస్థలకు, దేశంలోని రెండవ-అతిపెద్ద రిటైలర్ కు, అతిపెద్ద డిపాజిటరీకి, అనేక ప్రభుత్వ విభాగా లకు మద్దతునివ్వడం భారతదేశంలో ఈ సంస్థ నాయకత్వాన్ని చాటిచెబుతుంది. కచ్చితమైన, కొలవదగిన నిజ-సమయ అంతర్దృష్టులతో పోసిడెక్స్ భారతదేశంలోని అత్యంత కీలక రంగాల్లో కీలక సంస్థల నమ్మ కాన్ని సంపాదించుకుంది.

ఈ విజయం ఆధారంగా, పోసిడెక్స్ ఉత్తర అమెరికా, పశ్చిమాసియా, ఏపీఏసీ ప్రాంతంలో విస్తరిస్తోంది. అమె రికా, దుబాయ్, సింగపూర్, థాయిలాండ్, ఫిలిప్పీన్స్‌లో క్రియాశీల వృద్ధి జరుగుతోంది. కంపెనీ తన ప్రపంచ స్థాయిని విస్తృతం చేస్తున్నందున ఈ కొత్త బ్రాండ్ గుర్తింపు పోసిడెక్స్ పరిణామాన్ని మరియు నిజ-సమయ, 360-డిగ్రీ కస్టమర్ అంతర్దృష్టులను అందించడంలో కొనసాగుతున్న నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ఈ వ్యూహా త్మక రీబ్రాండ్ అనేది సంస్థ నిరూపిత పరిష్కారాలను అధిక-వృద్ధి అంతర్జాతీయ మార్కెట్‌లకు తీసు కువెళ్ల డం, కస్టమర్ డేటా మేనేజ్‌మెంట్, టెక్నాలజీ వినూత్నతలలో అగ్రగామిగా తన స్థానాన్ని బలోపేతం చేయ డం అనే పోసిడెక్స్ లక్ష్యంతో అనుగుణ్యం చేయబడింది.

పోసిడెక్స్ టెక్నాలజీస్ సహ వ్యవస్థాపకులు, సీఈఓ కె. వెంకట్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘సంక్లిష్ట మైన డేటా సవాళ్లను, డిమాండ్‌లను నిర్వహించడంలో మా అపారమైన అనుభవాన్ని ఉన్నత స్థాయికి తీ సుకెళ్లడంలో, అవకాశాలు లభిస్తున్న సరైన సమయంలో కఠినమైన డేటా గోప్యతా చట్టాలు & క్రాస్ బోర్డర్ డేటా ఆంక్షలకు అనుగుణంగా మా ఉత్పత్తుల పటిష్ఠ సూట్‌తో ప్రపంచ మార్కెట్ కు వెళ్లడానికి నేను సంతో షిస్తున్నాను, గర్వపడుతున్నాను. మా డేటా సెక్యూర్డ్, క్లౌడ్ ఉత్పత్తులు అంతర్జాతీయ సంస్థలు ఎదుర్కొనే అవకాశం ఉన్న డేటా సవాళ్లకు సరైన విధంగా సరిపోతాయి’’ అని అన్నారు.పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దత్తా గౌరవెల్లి మాట్లాడుతూ, ‘‘మా కొత్త బ్రాండ్ ఐడెంటిటీ కేవలం దృశ్యపరమైన మార్పు మాత్రమే కాదు-ఇది పోసిడెక్స్ ఆవిష్కరణలను ప్రపంచ స్థాయికి తీసుకురావడానికి మా సంసిద్ధతను సూచిస్తుంది’’ అని అన్నారు.

ప్రైమ్ ఎండీఎం, ప్రైమ్ 360, క్లిప్, రిలేట్ మరియు స్క్రీన్- లతో కూడిన పోసిడెక్స్ ఉత్పత్తుల సూట్-సురక్షి తమైన, నిజ-సమయ కస్టమర్ ఎంటిటీ రిజల్యూషన్, రికార్డ్ లింకేజ్ మరియు తెలివైన అంతర్దృష్టులను అంది స్తుంది. మరీ ముఖ్యంగా 21 సంవత్సరాల క్రితం అభివృద్ధి చేసిన పోసిడెక్స్ ప్రొప్రైటరీ అల్గారిథం, ప్రత్యేకమైన ఐదు-దశల పాలిమార్ఫిక్ టోకనైజేషన్ ప్రక్రియ ద్వారా కస్టమర్ డేటాను సురక్షిత టోకెన్‌లుగా మారుస్తుంది-ఇది ప్రపంచవ్యాప్తంగా ఓ విభిన్నమైన విధానం. క్లయింట్లు 99.5% ప్రాసెసింగ్ కచ్చితత్వంతో 75% వరకు తక్కువ అవస్థాపన ఖర్చులు, తగ్గిన రిస్క్, మెరుగైన సమ్మతి, శరవేగంతో కూడిన వృద్ధిని సాధించారు, వారి పోటీదారుల కంటే ముందున్నారు.

పోసిడెక్స్ టెక్నాలజీస్ గురించి..

2003లో స్థాపించబడిన, పోసిడెక్స్ టెక్నాలజీస్ అనేది కస్టమర్ ఇంటెలిజెన్స్, డేటా మేనేజ్‌మెంట్ సొల్యూ షన్స్‌లో ప్రత్యేకత కలిగిన హైదరాబాద్ ఆధారిత డీప్-టెక్ ఎంటర్‌ప్రైజ్. ఆసియన్ బ్యాంకర్ టెక్నాలజీ అవార్డు తో సత్కరించబడిన పోసిడెక్స్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్, ప్రభుత్వం, టెలికాం, రిటైల్ రంగాలలో 60 కి పైగా పరిశ్రమ ప్రముఖ సంస్థలకు మద్దతునిస్తుంది. తక్కువ ఖర్చుతో కూడుకున్న, అధిక-పనితీరు గల సొల్యూషన్‌లకు ప్రసిద్ధి చెందిన పోసిడెక్స్ కస్టమర్ మాస్టర్ డేటా మేనేజ్‌మెంట్, కాంటెక్చువల్ కస్టమర్ ఇన్ సైట్స్ లో ప్రపంచ ప్రభావం చూపేలా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gаrmаn асknоwlеdgеѕ thаt hе іѕ аt odds with the board mаjоrіtу. Latest sport news. American spy agency archives brilliant hub.