కాబోయే భర్త ఫోటో ను విడుదల చేసిన కీర్తి సురేష్

keerthi wedding

కీర్తి సురేష్ తన కాబోయే భర్త ఫొటోను షేర్ చేసింది. ఆంటోనీతో నా 15 ఏళ్ళ బంధం ఇంకా కొనసాగుతుంది అంటూ కాబోయే భర్తను పరిచయం చేసింది. హీరోయిన్ కీర్తి సురేష్ ఇటీవల కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు.అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కీర్తి సురేష్. తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోల సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్నారామె. ముఖ్యంగా ‘మహానటి’ సినిమాతో కీర్తి సురేష్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమాలో కీర్తి సురేష్ నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి. ఇటీవల కాలంలో కీర్తి సురేష్‌కు పెద్దగా హిట్లు లేకపోయినప్పటికీ బాగానే కెరీర్ లాగేస్తున్నారు.ఇప్పటి వరకూ కీర్తి సురేష్ ఎలాంటి ఎక్స్‌పోజింగ్‌ , రొమాంటిక్ సీన్స్ చేయలేదు.

ఇటీవలే తమిళంలో రఘు తాతతో పలకరించినా ఇది కూడా సేమ్ రిజల్ట్. తెలుగులో వేరే ఆర్టిస్టుతో డబ్బింగ్ చేసి ఓటిటిలో రిలీజ్ చేస్తే ఎవరూ పట్టించుకోలేదు. సరే గ్లామర్ ప్రపంచంలో ఎక్కువ కాలం మడికట్టుకు ఉంటే నెగ్గుకురావడం కష్టం. అందరూ గిరి గీసుకుని సాయిపల్లవిలు కాలేరుగా.

అందుకే కీర్తి సురేష్ రూటు మార్చింది. బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న బేబీ జాన్ మూవీకి కండీషన్లు తీసేసింది. తాజాగా విడుదలైన నైన్ మటక్క పాటలో కాస్ట్యూమ్స్ విషయంలో మొహమాటం తగ్గించడం వీడియో రూపంలో కనిపిస్తోంది. ఇంత గ్లామరస్ గా గతంలో తను కనిపించలేదన్నది వాస్తవం. విజయ్ బ్లాక్ బస్టర్ తేరి రీమేక్ గా రూపొందుతున్న ఈ పోలీస్ డ్రామాకు అట్లీ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తుండగా కలీస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఒరిజినల్ వెర్షన్ లో సమంతా చేసిన పాత్రను హిందీలో కీర్తి సురేష్ తో చేయించారు. కానీ తేరిలో ఇంత ఊర మాస్ టచ్ సామ్ క్యారెక్టర్ కు లేదు.

ఈ లెక్కన మార్పులు గట్టిగా చేసినట్టు ఉన్నారు. వరుణ్ ధావన్ హీరోగా నటించిన బేబీ జాన్ డిసెంబర్ 25 విడుదల కాబోతోంది. పుష్ప 2 వచ్చిన ఇరవై రోజులకే రిలీజ్ చేయడం సేఫ్ కాదని నార్త్ డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నప్పటికీ టీమ్ మాత్రం చాలా నమ్మకంగా ఉంది. ఇది కనక బ్రేక్ ఇస్తే రష్మిక మందన్న తరహాలో తనకూ గుర్తింపు వస్తుందని కీర్తి సురేష్ ఎదురు చూస్తోంది.

ఇదిలా ఉంటె కీర్తి సురేష్ కు 15 సంవత్సరాల నుంచి పరిచయం ఉన్న ఆంటోని తటిల్ తోనే వివాహం జరగబోతోందని అధికారికంగా చెప్పారు. గోవాలోని ఓ రిసార్ట్ లో వీరి వివాహ వేడుక జరుగుతుందన్నారు. దీంతో కీర్తి సురేష్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మొత్తానికి రూమర్లన్నింటికీ చెక్ పడిందని, ఇకనైనా ఆపాలంటూ రూమర్లు క్రియేట్ చేసేవారిని వారు విన్నవించుకుంటున్నారు. డిసెంబరు 11 లేదంటే 12వ తేదీన వీరి వివాహం జరగబోతోంది. నెటిజన్లు కీర్తిసురేష్ – ఆంటోని తటిల్ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Consolidated bank ghana achieves record gh¢1 billion revenue in q3 2024. Construindo uma vida equilibrada após o tratamento : clínica de recuperação liberdade e vida para dependentes químicos. て?.