‘ఓజి’ సినిమా ఫస్ట్ సింగిల్ అప్డేట్

OG update

గత కొంతకాలంగా రాజకీయాలతో బిజీ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రీసెంట్‌గా ఆగిపోయిన తన సినిమాల షూటింగ్లను తిరిగి మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ లో పాల్గొంటున్న పవన్ కళ్యాణ్ త్వరలోనే ‘ఓజి’ మూవీ షూటింగ్ ను కూడా స్టార్ట్ చేయబోతున్నారు. ఇక ‘హరిహర వీరమల్లు’ కంటే ‘ఓజి’ మూవీ అప్డేట్స్ కోసమే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

తాజాగా ‘ఓజి’ కి సంబదించిన క్రేజీ అప్డేట్ చక్కర్లు కొడుతుంది. సాహో ఫేమ్ సుజిత్‌ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ పవర్​ ఫుల్​ గ్యాంగ్​స్టర్​ యాక్షన్ మూవీని పాన్‌ ఇండియా చిత్రంగా డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ప్రియాంక అరుల్‌ మోహన్‌ కథానాయికగా నటిస్తుండగా, ఇమ్రాన్‌ హష్మీ ప్రతినాయక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముగింపు దశలో ఉంది. ఈ నేపథ్యంలోనే సినిమాలోని తొలి సాంగ్ ను రిలీజ్ చేసేందుకుమేకర్స్ సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలిసింది.

కొత్త ఏడాది సందర్భంగా జనవరి 1న ఈ సాంగ్​ను విడుదల చేస్తారని సమాచారం. వాస్తవానికి సెప్టెంబరు 2న పవన్‌ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగానే ఈ ఫస్ట్ సాంగ్​ను రిలీజ్ చేయాలని భావించినప్పటికీ అప్పుడు కుదరలేదు. ఎందుకంటే అప్పటికీ ఏపీలో ఉన్న వరదల పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని విడుదల చేయలేదు. ఇప్పుడా సాంగ్​నే కొత్త ఏడాది రోజున విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ గ్యాంగ్‌స్టర్‌ డ్రామాలో పవన్‌ కల్యాణ్ ఓజాస్‌ గంభీర అనే పవర్​ ఫుల్​ పాత్రలో కనిపించనున్నారు. ఆయన్ని ఢీకొట్టే ప్రతినాయకుడిగానే ఇమ్రాన్‌ నటిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముంది. సినిమాకు తమన్‌ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. చిత్రంలో కోలీవుడ్‌ స్టార్ హీరో శింబు కూడా ఓ పాట పాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facing wаr іn thе mіddlе eаѕt and ukraine, thе us lооkѕ fееblе. Latest sport news. 記事.