‘పుష్ప-2′ ట్రైలర్ పై వార్నర్ ట్వీట్

david warner pushpa 2

అల్లు అర్జున్ – సుకుమార్ కలయికలో తెరకెక్కిన పుష్ప 2 డిసెంబర్ 05 న పాన్ ఇండియా గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీ పై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదు. ఇక సినిమా రిలీజ్ దగ్గర పడుతుండడం తో మేకర్స్ ప్రమోషన్ కార్య క్రమాలు స్పీడ్ చేశారు. నిన్న ఆదివారం ఈ మూవీ ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని పాట్నా లో అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ తో పాటు హీరోయిన్ రష్మిక , పలువురు చిత్ర యూనిట్ పాల్గొన్నారు. ఈ వేడుక భారీ సక్సెస్ కావడమే కాదు అల్లు అర్జున్ రేంజ్ ఏంటో నేషనల్ మొత్తం మాట్లాడుకునేలా చేసింది.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే..మాటల్లో చెప్పలేం..పుష్ప రేంజ్ ఏంటో సినిమాలో చూడాలసిందే అని అనుకునేలా కట్ చేసారు. పుష్ప అంటే ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ , పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్ నేషనల్ అంటూ బన్నీ చెపుతున్న ఒక్కో డైలాగ్ కు వెట్రుకలు నిక్కబొడుతున్నాయి. ఈ ట్రైలర్ చూసిన అభిమానులు , సినీ ప్రముఖులు తమ స్పందనను తెలియజేస్తూ వస్తున్నారు.

తాజాగా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ‘పుష్ప’ మేనరిజంతో ప్రతి ఇండియన్స్ ను ఆశ్చర్య పరుస్తున్న విషయం తెలిసిందే. నిన్న ‘పుష్ప-2’ ట్రైలర్ రిలీజవడంతో ‘చాలా బాగుంది బ్రదర్’ అని అల్లు అర్జున్ను ట్యాగ్ చేస్తూ ఇన్స్టాలో స్టోరీ పెట్టారు. దీనికి అల్లు అర్జున్ సైతం స్పందిస్తూ ‘ఎంతో ప్రేమతో.. మీకు ధన్యవాదాలు’ అని రిప్లై ఇచ్చారు. దర్శకధీరుడు రాజమౌళి ట్వీట్ చేశారు. ‘పట్నాలో WILDFIRE మొదలైంది. దేశమంతటా విస్తరిస్తోంది. డిసెంబర్ 5న పేలనుంది. పార్టీ కోసం ఎదురుచూస్తుంటా పుష్ప’ అని పేర్కొన్నారు. ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసిందని ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు సైతం పోస్టులు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

But іѕ іt juѕt an асt ?. Exciting news for cricket fans ! the lanka premier league 2023 (lpl 2023) is making a big leap by broadcasting its. Cinemagene編集部.