నేడు నాంపల్లి కోర్టు ముందు హాజరుకానున్న నాగార్జున

Defamation suit against minister.. Nagarjuna to appear in court tomorrow

నేడు నాంపల్లి కోర్టు ముందు హాజరుకానున్న నాగార్జున హాజరుకాబోతున్నారు. ఇటీవల మంత్రి కొండా సురేఖ నాగార్జున తో పాటు ఆయన మాజీ కోడలు పై చేసిన వ్యాఖ్యలకు గాను నాగార్జున నాంపల్లి కోర్ట్ లో సురేఖ పై పరువు నష్టం దావా వేశారు. నాగార్జున పిటిషన్ పై నాంపల్లి మనోరంజన్ కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా నాగార్జున తరపున వాదనలు సీనియర్ కౌన్సిల్ అశోక్ రెడ్డి వినిపించారు.

దీంతో పిటిషనర్ నాగార్జున స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామని కోర్టు పేర్కొంది. ఈ తరుణంలోనే.. ఇవాళ కోర్ట్ కు హాజరు కానున్నారు అక్కినేని నాగార్జున. నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలాలని ఇవాళ నమోదు చేయాలని కోరారు నాగార్జున తరపున న్యాయవాది అశోక్ రెడ్డి. తదుపరి విచారణ ఈరోజుకు వాయిదా వేసింది మనోరంజన్ కోర్టు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *