‘పుష్ప-2’ నుంచి ‘పీలింగ్స్’ సాంగ్ ప్రోమో వచ్చేసింది..

peelings song promo out fro

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సుకుమార్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న భారీ చిత్రం పుష్ప‌-2. ఈ సినిమా డిసెంబ‌ర్ 5న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇప్ప‌టికే మూవీ నుంచి విడుద‌లైన ప్ర‌చార చిత్రాలు, పాట‌ల‌తో పుష్ప‌-2పై భారీ అంచనాలు నెల‌కొన్నాయి. రీసెంట్ గా విడుదలైన ‘కిస్సిక్’ సాంగ్ ఆల్ టైమ్ రికార్డు సృష్టించినట్లు మేకర్స్ వెల్లడించారు. 24 గంటల్లో ఇండియాలోనే అత్యధిక వ్యూస్ సాధించిన లిరికల్ వీడియోగా నిలిచినట్లు తెలిపారు. మొత్తంగా 42+ మిలియన్ వ్యూస్ నమోదు అయ్యాయని , యూట్యూబ్లో ట్రెండింగ్-1గా కొనసాగుతోందని పేర్కొంటూ ఓ పోస్టర్ను మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

రీసెంట్ గా సినిమా నుండి వచ్చిన మోస్ట్ అవైటెడ్ ఐటెం సాంగ్ అయిన కిస్సిక్(#KISSIK (#Pushpa2TheRule) సాంగ్, ఓవరాల్ గా పుష్ప లోని ఊ అంటావా సాంగ్ రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకోక పోయినా కూడా ఓవరాల్ గా మంచి రీచ్ ను సాధించింది. లైక్స్ పరంగా కొత్త రికార్డులు ఏమి నమోదు అవ్వలేదు కానీ వ్యూస్ పరంగా మాత్రం టాలీవుడ్ రికార్డుల బెండు తీసిన ఈ సాంగ్ తర్వాత సౌత్ రికార్డులను కూడా బ్రేక్ చేసి అప్ కమింగ్ లిరికల్ సాంగ్స్ కి ఇప్పుడు బిగ్గెస్ట్ టార్గెట్ ను సెట్ చేసి పెట్టింది అని చెప్పాలి.

ఇదిలా ఉండగా ‘పుష్ప-2’ సినిమా నుంచి ‘పీలింగ్స్’ సాంగ్ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. పూర్తి పాటను డిసెంబర్ 1న రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ పాటకు రక్వీబ్ ఆలమ్ లిరిక్స్ అందించారు. జావేద్ అలీ, మధుబంటి బాగ్చి పాడారు. మలయాళం లిరిక్స్లో ఈ పాట మొదలవుతుందని బన్నీ ఇటీవల ఓ ఈవెంట్లో తెలిపారు. “పుష్ప: ది రైజ్”లో సాంగ్స్ ఎంతటి విజయాన్ని సాధించాయో తెలిసిందే. ఇప్పుడు “పుష్ప-2″లో కూడా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అదే స్థాయిలో పాటలను ప్లాన్ చేశారు. అల్లు అర్జున్‌కి కేరళలో ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. అందుకే ఈసారి మలయాళ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
సినిమా విడుదలకు ముందే ఈ పాటలు, ఈవెంట్స్ ద్వారా మంచి బజ్ క్రియేట్ చేసిన మేకర్స్, సినిమా ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకోవడంలో విజయం సాధిస్తారని ఆశిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

If you’re looking to start a side business that doesn’t consume a lot of time, you’re not alone. Construindo uma vida equilibrada após o tratamento : clínica de recuperação liberdade e vida para dependentes químicos. 用規?.