ప్రముఖ హీరో శివకార్తికేయన్, సాయి పల్లవి నటించిన “అమరన్” సినిమా రేపటి నుంచి Netflixలో స్ట్రీమింగ్ కానుంది. తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. దీపావళి కానుకగా అక్టోబరు 31న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. రూ.300 కోట్లకి పైగా బాక్సాఫీస్ వద్ద వసూళ్లని రాబట్టింది. ఈ సినిమాకి రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. శివకార్తికేయన్, సాయి పల్లవి నటన, సినిమాటోగ్రఫీ, సంగీతం, కథ ఇలా అన్ని కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అద్భుతమైన ప్రదర్శనతో ఈ చిత్రం సర్వసాధారణంగా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచింది.
తమిళ్ సినిమాలు సాధారణంగా థియేటర్లలో రిలీజైన 28-30 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తుంటాయి. కానీ..అమరన్ మూవీ మాత్రం కాస్త ఆలస్యంగా ఓటీటీలో స్ట్రీమింగ్‌కి రాబోతోంది. దానికి కారణంగా..ఎవరూ ఊహించని విధంగా సినిమా వసూళ్లని రాబట్టడమే. అమరన్ రిలీజైన రోజే క, లక్కీ భాస్కర్ సినిమాలు కూడా విడుదలైనా.. ఈ రెండూ అమరన్ కలెక్షన్లతో పోటీపడలేకపోయాయి. లక్కీ భాస్కర్ రూ.100 కోట్ల దగ్గరే ఆగిపోగా.. క సినిమా రూ.50 కోట్ల మార్క్‌ని కూడా చేరుకోలేకపోయింది. ఈ రెండు సినిమాలు ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్‌కి కూడా వచ్చేసిన విషయం తెలిసిందే.
అదే సమయంలో మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన “మట్కా” సినిమా కూడా రేపటి నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానుంది. కానీ ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అయ్యింది. మరి థియేటర్స్ లోనే పట్టించుకోని సినీ ప్రేక్షకులు , ఓటిటి లో చూస్తారా అనేది సందేహమే.