బుజ్జితల్లి వచ్చేస్తుంది

bujjithalli

అక్కినేని నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోన్న ‘తండేల్’ నుంచి అప్డేట్ వచ్చింది. ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ‘బుజ్జి తల్లి’ సాంగ్ ను ఈనెల 21న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. చందూ మొండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను వాలెంటైన్ వీక్ సందర్భంగా 2025 ఫిబ్రవరి 7న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇటీవల వెల్లడించింది. దీంతో మేకర్స్ త్వరలోనే ప్రమోషన్స్ ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు.

ఈ నేపథ్యంలో సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ‘బుజ్జి తల్లి’ అనే పాటను నవంబర్ 21న విడుదల చేయనున్నట్లు మేకర్స్ సోమవారం ప్రకటించారు. ఈ మేరకు ఓ చైతన్య- సాయిపల్లవి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘తండేల్ రాజు బుల్లితల్లికి ప్రేమతో’ ఈ లవ్ ట్రాక్ 2024లోనే సాంగ్ ఆఫ్ ది ఇయర్​ అవ్వనుందంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. తాజా అప్డేట్​తో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ గా ఉన్నారు.

ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే.. ఒక మత్స్యకారుడి నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఇది తెరకెక్కుతోంది. ఈ కథంతా సముద్ర తీర ప్రాంతం చుట్టూనే తిరుగనుంది. శ్రీకాకుళంలో మొదలై పాకిస్థాన్ వరకూ చేరుకుంటుంది. ఈ క్రమంలో కొందరు మత్స్యకారులు పాకిస్థాన్‌ కోస్టు గార్డులకు చిక్కుతారు. ఆ తర్వాత వాళ్లు ఎదుర్కొన్న సమస్యలు, కష్టాల గురించి ఈ సినిమాలో చూపించినట్లు తెలుస్తుంది. ఈ మూవీ లో నాగ చైతన్య రగ్గ్‌డ్ లుక్​లో కనిపించగా, సాయి పల్లవి తన క్యూట్ లుక్స్​తో ఆకట్టుకున్నారు. బోటుపై చేపల వేటకు వెళ్తున్న చైతూ ‘దద్దా గుర్తెట్టుకో ఈపాలి యాట గురి తప్పేదెలేదేస్ ఇక రాజులమ్మ జాతరే’ అంటూ చెప్పే డైలాగ్‌ అభిమానులను ఆకట్టుకుంది.

ఈ సినిమాకు రాక్​స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, గీతా ఆర్ట్స్ బ్యానర్​పై అల్లు అరవింద్, బన్నీ వాస్​ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

But іѕ іt juѕt an асt ?. Exciting news for cricket fans ! the lanka premier league 2023 (lpl 2023) is making a big leap by broadcasting its. Mushroom ki sabji : 5 delicious indian mushroom recipes brilliant hub.