హీరోయిన్ శ్రీలీల తన కెరీర్‌లో చాలా ఐటెమ్ సాంగ్స్ ఆఫర్లు వచ్చినప్పటికీ, వాటిని తిరస్కరించానని చెప్పుకొచ్చింది. “పుష్ప-2” సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి అంగీకరించినట్లు ఆమె రాబిన్ హుడ్ మూవీ ఈవెంట్లో తెలిపింది. ఈ పాటను “యావరేజ్ ఐటెమ్ సాంగ్” గా చూడవద్దని, సినిమా విడుదలయ్యాక దీనికి సంబంధించిన ప్రత్యేకత అన్ని వారికి తెలుస్తుందని పేర్కొన్నారు.
మూడేళ్ల క్రితం వచ్చిన పుష్ప సినిమా ఎలాంటి పెద్ద హిట్ అయిందో అందరం చూశాం. తెలుగు ఓవర్సీస్లో అయితే ఇబ్బంది లేదు. మంచి వసూలు సాధించింది. ఎలాంటి అంచనాలు లేకుండా, ఎలాంటి ప్రమోషన్లు లేకుండా బాలీవుడ్లో రిలీజ్ అయిన పుష్ప సినిమా నార్త్ సినీ ప్రేమికులను ఒక ఊపు ఊపేసింది. మరీ ముఖ్యంగా బన్నీ మేనరిజంతో పాటు.. బన్నీ డ్యాన్సులు సమంతతో చేసిన.. ఉ అంటావా మామ.. ఉ ఊ అంటావా అనే పాట యావత్ దేశాన్ని.. ఒక ఊపు ఊపిన సాంగ్.. ఈ పాటలో ఉన్న మత్తు, గమ్మత్తు అంతా ఇంతా కాదు. ఈ సాంగ్ ఇప్పటికీ సూపర్ డూపర్ హిట్టై వినిపిస్తూనే ఉంటుంది. ఇక ఇప్పుడు పుష్ప 2 సినిమా నుంచి ఐటెం సాంగ్ వచ్చింది.
పుష్ప 2 సినిమాలో ఐటెం సాంగ్ కూడా అంతకుమించి ఉంటుందని అందరూ ఆశలు పెట్టుకున్నారు. కిసిక్ అంటూ లిరిక్‌తో సహా.. ఈ పాట బాగా లేదని చెప్పలేని పరిస్థితి. ఉన్నంతలో ఓకే కానీ.. అది సరిపోదు. సమంత ఐటమ్ సాంగ్ తో పోల్చుకుంటే ఆ సాంగ్‌కు ఏమాత్రం సరితూగదు. ఈ పాటకు అంత స్థాయి లేదు అని అంటున్నారు జనాలు. కనీసం వినగా వినగా.. తినగా తినగా అయినా వైరల్ అయ్యేంత కంటెంట్ ఈ కిస్సిక్ సాంగ్ లో కనిపించడం లేదు అనేది మెయిన్ కంప్లైంట్.
కిస్సిక్.. అనే ఈ ఐటెం సాంగ్ లో యంగ్ బ్యూటీ శ్రీలీల నటించింది. మొదట్లో శ్రీలీల చేయను అన్నారట. మంచి రెమ్యూనరేషన్ ఇవ్వడంతో పాటు, బ్రతిమిలాడి ఆమెను ఒప్పించారని టాక్ ఉంది. శ్రీలీలకు కెరీర్లో ఫస్ట్ ఐటెం సాంగ్ ఇది. అలాగే అతిపెద్ద ఛాలెంజ్ కూడాను. మరి ఈ సాంగ్ రేపు థియేటర్స్ లలో ఏ రేంజ్ లో రచ్చ లేపుతుందో చూడాలి.