కీరవాణి ఇంట్లో పెళ్లి సందడి

srsimha raga

మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. ఎన్నో సినిమాలకు పెళ్లి సంగీతాలు అందించిన కీరవాణి ఇప్పుడు తన కుమారుడి పెళ్లి భాజాలు మోగించించేందుకు సిద్దమయ్యాడు. ఆయన చిన్న కుమారుడు శ్రీ సింహా త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. సీనియర్‌ నటుడు మురళీ మోహన్‌ మనవరాలు రాగ మాగంటిని వివాహం చేసుకోబోతున్నాడు. నిన్న ఆదివారం రాత్రి ప్రీ వెడ్డింగ్‌ వేడుకను ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్‌ గోల్కొండ రిసార్ట్స్‌లో జరిగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. దర్శకుడు, కీరవాణి సోదరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి ఫ్యామిలీతోపాటు స్టార్‌ హీరో మహేశ్‌ బాబు, సితార, నరేశ్‌, పవిత్రా లోకేశ్‌ తదితరులు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. ఈ ప్రీవెడ్డింగ్‌ వేడుకలకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

కాగా, శ్రీ సింహా ఇటీవలే ‘మ‌త్తు వ‌ద‌ల‌రా 2’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. బ్లాక్ బ‌స్టర్ మూవీ ‘మ‌త్తు వ‌ద‌ల‌రా’ కు సీక్వెల్‌గా వ‌చ్చిన ఈ చిత్రానికి రితేశ్ రానా దర్శకత్వం వ‌హించాడు. జాతి రత్నాలు ఫేం ఫరియా అబ్దుల్లా ఫీ మేల్ లీడ్‌ రోల్‌లో న‌టించింది. క్రైమ్ కామెడీగా సెప్టెంబ‌ర్ 13న ప్రేక్షకుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద సూప‌ర్ హిట్ అందుకుంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. వాస్తవానికి శ్రీ సింహ 2007లో యమదొంగ చిత్రంలో బాలనటుడిగా చిత్రసీమలోకి అడుగుపెట్టాడు. శ్రీ‌ సింహా కోడూరి 1996, ఫిబ్రవరి 23న హైదరాబాదులో జన్మించాడు.

2007లో ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో, జూ. ఎన్టీయార్ హీరోగా వచ్చిన యమదొంగ చిత్రం ద్వారా బాలనటుడిగా సినీరంగంలోకి వచ్చాడు. సునీల్ హీరోగా వచ్చిన మర్యాద రామన్న సినిమాలో బాలనటుడిగా నటించాడు. 2012లో ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వహించిన ఈగ సినిమాలో సమంత మిత్రుడిగా నటించాడు. 2018లో సుకుమార్ దర్శకత్వం వహించిన రంగస్థలం (సినిమా) చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు.

మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై చిరంజీవి (చెర్రీ), హేమలత నిర్మాణ సారథ్యంలో 2019లో రితేష్ రానా దర్శకత్వం వహించిన మత్తు వదలరా చిత్రం ద్వారా క‌థానాయ‌కుడిగా పరిచయమయ్యాడు. 2021, మార్చి 27న మణికాంత్‌ దర్శకత్వం వహించిన శ్రీసింహా హీరోగా నటించిన ‘తెల్లవారితే గురువారం’ చిత్రం విడులైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Biznesnetwork – where african business insights brew !. Construindo uma vida equilibrada após o tratamento : clínica de recuperação liberdade e vida para dependentes químicos. イバシーポリシー.