సీఎంఆర్ చెల్లింపుల గడువు పెంచిన తెలంగాణ ప్రభుత్వం

11

హైదరాబాద్‌: సీఎం రేవంత్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని రైస్ మిల్లులు ప్రభుత్వానికి చెల్లించే సీఎంఆర్‌ బకాయిల గడువు తేదీని మరో 3 నెలల పాటు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో డిఫాల్ట్ కానీ మిల్లులు ధాన్యం బస్తాలు నింపుకుని ‘సీఎంఆర్’ బకాయిలు చెల్లించేందుకు సిద్దంగా ఉండగా.. డిఫాల్ట్ అయిన మిల్లులకు మాత్రం సీఎంఆర్ చెల్లించేందుకు గడువు పెంచుతూ వెసులుబాటు కల్పించారు.

దీంతో పాత బకాయిలు చెల్లించని డిఫాల్టర్లు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎవరైతే డిఫాల్టర్‌గా తేలారో అనగా.. 2021-22 ఏడాది నుంచి తీసుకున్న ధాన్యానికి బియ్యం, బకాయిలు చెల్లించని మిల్లులకు ఈసారి ప్రభుత్వం ధాన్యం ఇవ్వలేదు. ధాన్యం ఇవ్వాలంటే 100 శాతం బ్యాంక్ గ్యారెంటీతో పాటుగా 25 శాతం జరిమానా చెల్లించాలని షరతు విధించారు. ప్రభుత్వ నిబంధనలు కఠినంగా ఉండటంతో చాలామంది మిల్లర్లు ధాన్యం తీసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. హుజురాబాద్‌లో 40 మిల్లులు ఉండగా కేవలం 8 మిల్లులకు మాత్రమే ధాన్యం కేటాయించగా.. మిగతా మిల్లులు డిఫాల్ట్ర్‌గా తేలాయి. వారు జరిమానా చెల్లిస్తే ధాన్యం తీసుకునే వీలున్నా ప్రస్తుతం ధాన్యం నిల్వలు ఐకేపీ కేంద్రాల్లో లేవని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Top best exclusive denyo generator deals sierracodebhd. Die kuh heinz erhardt. Domestic helper visa extension hk$900.