మాఫీ కాని రైతుల కోసం నాలుగో విడుత రుణమాఫీ రూ.2747.67 కోట్లు నిధులను విడుదల చేశారు సీఎం రేవంత్. తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కావడం తో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన సంబరాలు జరుపుతుంది. ముఖ్యంగా రైతులకు కాంగ్రెస్ సర్కార్ గొప్ప వరమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులపై దృష్టి సారించింది. ఏడాదిలోపు మూడు విడతలుగా రైతుల రుణమాఫీ చేసిన ప్రభుత్వం..ఈరోజు పాలమూరు వేదికగా నాల్గో విడత రుణమాఫీ చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు విడతలుగా రైతులకు రుణమాఫీ చేసింది. తొలి విడత 11 లక్షల 34 వేల 412 మందికి లక్ష వరకు రుణమాఫీ చేసింది. రెండో విడతలో మరో ఆరున్నర లక్షల మందికి లక్షన్నర వరకు రుణాలను మాఫీ చేసింది. మూడో విడతలో నాలుగున్నర లక్షల మందికి 2 లక్షల వరకు చేసింది.
శనివారం నాలుగో విడతగా మూడు లక్షల మంది రైతులకు 3 వేల కోట్ల రూపాయలను విడుదల చేసింది. మాఫీ కాని రైతుల కోసం నాలుగో విడుత రుణమాఫీ రూ.2747.67 కోట్లు నిధులను విడుదల చేశారు. రుణమాఫీలో నెలకొన్న టెక్నికల్ సమస్యను పరిష్కరించి నిధులను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. రుణమాఫీ జరగని 3.14 లక్షల మంది రైతుల ఖాతాలలోకి ఈ నిధులు జమ అవుతాయని చెప్పారు.
కొంతమందికి ఆధార్ లో సమస్యలు, టెక్నికల్ కారణాలు, రూ.2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉండటం వల్ల మాఫీ అవ్వలేదు. ఆ రైతులకు కూడా న్యాయం జరిగేలా నేడు రైతుపండుగ సభలోనే నిధులను విడుదల చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు కొలువుదీరి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా తొమ్మిది రోజుల పాటు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ వ్యాప్తంగా డిసెంబరు 1 నుంచి 9 వరకు ఘనంగా వేడుకలను నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. ఉత్సవాల్లో భాగంగా కీలకమైన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 9 రోజుల పాటు జరిగే సంబరాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే కీలక భూమికగా ఉండేలా కార్యాచరణను రూపొందిస్తోంది.