ప్రతిపక్షాల అబద్ధాలను తిప్పికొట్టాలి: మహేష్ కుమార్ గౌడ్

mahesh kumar

ప్రతిపక్ష నేతలు ప్రచారం చేస్తున్న అబద్ధాలను తిప్పికొట్టాలని TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేసిన పనులను చెప్పుకోకపోతే వెనుకబడిపోతామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోన్న మంచి పనులకు పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని సూచించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కష్టపడ్డవారికి పార్టీలో గుర్తింపు, పదవులుంటాయన్నారు.

తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కావడం తో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన సంబరాలు జరుపుతుంది. ముఖ్యంగా రైతులకు కాంగ్రెస్ సర్కార్ గొప్ప వరమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులపై దృష్టి సారించింది. ఏడాదిలోపు మూడు విడతలుగా రైతుల రుణమాఫీ చేసిన ప్రభుత్వం, ఈసారి నాలుగో విడతకు శ్రీకారం చుట్టింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు విడతలుగా రైతులకు రుణమాఫీ చేసింది. తొలి విడత 11 లక్షల 34 వేల 412 మందికి లక్ష వరకు రుణమాఫీ చేసింది. రెండో విడతలో మరో ఆరున్నర లక్షల మందికి లక్షన్నర వరకు రుణాలను మాఫీ చేసింది. మూడో విడతలో నాలుగున్నర లక్షల మందికి 2 లక్షల వరకు చేసింది.

శనివారం నాలుగో విడతగా మూడు లక్షల మంది రైతులకు 3 వేల కోట్ల రూపాయలను విడుదల చేయనుంది ప్రభుత్వం. వీరిలో చాలామందికి రేషన్ కార్డు లేకపోవడం, బ్యాంకు ఖాతాల సమస్య, ఆధార్ కార్డుల్లో సమస్యలు, ఇతర సాంకేతిక సమస్యలతో మరో మూడు లక్షల మందికి రుణమాఫీ జరగలేదని గుర్తించారు అధికారులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Best zoomlion skid steer loader deals sierracodebhd. Die kuh heinz erhardt. Advantages of overseas domestic helper.