రతన్ టాటా మృతి.. కన్నీళ్లు పెట్టుకున్న కేంద్రమంత్రి పీయూష్ గోయల్

Piyush Goyal breaks down re

దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్‌ గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటా (86) కన్నుమూసిన సంగతి తెలిసిందే. ముంబయిలోని బ్రీచ్‌ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. రతన్‌ టాటా మరణ వార్తతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ సంతాపం వ్యక్తం చేశారు.

ఇక రతన్ టాటాతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఎమోషనల్ అయ్యారు. ‘నా ఆహ్వానం మేరకు ఆయన ఓరోజు మా ఇంటికి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేశారు. చాలా సింపుల్గా ఉంటారాయన. వెళ్లేటప్పుడు “నాతో ఫొటో దిగుతారా?” అని నా భార్యను అడిగారు. రతన్ తో ఫొటో దిగాలని ఎవరికి ఉండదు?’ అంటూ పీయూష్ కన్నీళ్లు పెట్టుకున్నారు. అది తమకు ఎప్పుడూ గుర్తుండిపోయే జ్ఞాపకమని వివరించారు.

రతన్​ టాటా 1937 డిసెంబర్‌ 28న ముంబయిలో నావల్‌ టాటా- సోనీ టాటా దంపతులకు జన్మించారు. 1962లో కార్నెల్‌ యూనివర్సిటీ నుంచి బీ-ఆర్క్‌ డిగ్రీ సంపాదించారు. తరువాత టాటా గ్రూప్‌లో చేరారు. తొలుత టాటా స్టీల్‌ సంస్థలో షాప్‌ ఫ్లోర్‌లో ఉద్యోగిగా ఆయన పనిచేశారు. 1971లో నేషనల్‌ రేడియో, ఎలక్ట్రానిక్స్‌ కంపెనీ లిమిటెడ్‌ డైరెక్టర్‌ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు. ఇక 1991లో జేఆర్‌డీ టాటా నుంచి టాటా సన్స్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన టాటా గ్రూప్‌నకు కూడా నేతృత్వం వహించారు. 1990 నుంచి 2012 వరకు టాటా గ్రూప్‌నకు రతన్‌ టాటా ఛైర్మన్‌గా ఉన్నారు. అక్టోబర్ 2016 నుంచి ఫిబ్రవరి 2017 వరకు తాత్కాలిక ఛైర్మన్‌గా వ్యవహరించారు. 2000లో రతన్‌ టాటా సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం పద్మభూషణ్‌ను, 2008లో పద్మవిభూషణ్‌ పురస్కారాలను అందించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This adverse currency shift inflated safaricom’s expenses in ethiopia, costing the company ksh 17. Por fim, o acompanhamento contínuo é uma estratégia essencial para prevenir recaídas. コぐら?.