Israeli Prime Minister Netanyahu reacts to the death of Ratan Tata

రతన్ టాటా మరణంపై స్పందించిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు

న్యూఢిల్లీ: భారత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మరణంపై ప్రపంచ దేశాల అధినేతలు సంతాపాలు తెలియజేస్తున్నారు. తాజాగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమన్ నెతన్యాహు స్పందించారు. భారత్-ఇజ్రాయెల్ మధ్య స్నేహ బంధానికి ఛాంపియన్‌గా రతన్ టాటాను ఆయన కొనియాడారు. ఈమేరకు ఎక్స్ వేదికగా సంతాప సందేశాన్ని పంచుకున్నారు. ‘భారత్ గర్వించదగిన కొడుకు’ అని కొనియాడారు. భారత్-ఇజ్రాయెల్ సంబంధాలను పెంపొందించడంలో రతన్ టాటా ముఖ్య పాత్ర పోషించారని అన్నారు. ‘‘ఇజ్రాయెల్‌లోని చాలామంది ప్రజలతో పాటు నేను కూడా రతన్ టాటా…

Read More

ఆ ఒక్క కోరిక తీరకుండానే చనిపోయిన రతన్ టాటా

దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్‌ గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటా (86) కన్నుమూసిన సంగతి తెలిసిందే. ముంబయిలోని బ్రీచ్‌ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. రతన్‌ టాటా మరణ వార్తతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ సంతాపం వ్యక్తం చేశారు. అయితే టాటా కు ఒక కోరిక ఉండేదట..ఆ కోరిక తీరకుండానే…

Read More
Ratan Tata

భార‌త క్రికెట‌ర్ల‌కు ర‌త‌న్ టాటా సాయం.. ఫరూఖ్ ఇంజనీర్ నుంచి యువీ, శార్ధూల్ ఠాకూర్ వ‌ర‌కు ఎంద‌రికో ప్రోత్సాహం!

టాటా గ్రూప్‌ ఛైర్మన్ రతన్ టాటా క్రీడల పట్ల ఉన్న అంకితభావం మరియు ముఖ్యంగా క్రికెట్‌పై ఉన్న ఆసక్తి అత్యంత ప్రత్యేకమైనది. క్రికెట్‌ను ఎంతో ప్రేమించే రతన్ టాటా, భారత క్రికెటర్లకు పెద్దగా మద్దతు ఇవ్వడం ద్వారా వారి ప్రొఫెషనల్ కెరీర్‌కి ఊతం ఇచ్చారు. టాటా గ్రూప్‌ భారత క్రికెట్‌లో ఎంతో మంది ఆటగాళ్లకు నమ్మకమైన మద్దతుగా నిలవడమే కాకుండా, వారి విజయాల్లో భాగస్వామ్యం అయ్యింది. టాటా ట్రస్టు ద్వారా ఈ గ్రూప్ ఆటగాళ్లకు ఆర్థిక సహాయాన్ని…

Read More

రతన్ టాటా మృతి.. కన్నీళ్లు పెట్టుకున్న కేంద్రమంత్రి పీయూష్ గోయల్

దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్‌ గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటా (86) కన్నుమూసిన సంగతి తెలిసిందే. ముంబయిలోని బ్రీచ్‌ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. రతన్‌ టాటా మరణ వార్తతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ సంతాపం వ్యక్తం చేశారు. ఇక రతన్ టాటాతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ…

Read More

రతన్ టాటాకు ‘భారతరత్న’ ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వం తీర్మానం..

దివంగత రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అభ్యర్థించింది. రతన్ టాటాను కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ2 సర్కార్ 2008లో పద్మ విభూషణ్ పురస్కారం ఇచ్చి సత్కరించింది. అయితే దేశ అత్యున్నత పౌరపురస్కారం అయిన భారతరత్న అవార్డును రతన్ టాటాకు ఇవ్వాలని ఆ తర్వాత దేశవ్యాప్తంగా డిమాండ్లు వినిపించాయి. దేశానికి ఆయన చేసిన సేవలు, దేశ అభివృద్ధి కోసం టాటా గ్రూప్ చేసిన ఎన్నో కార్యక్రమాలకు గుర్తుగా ఆయనకు భారతరత్న ఇవ్వడమే సరైంది అని ఎంతోమంది…

Read More

రతన్ టాటా ఇచ్చిన విరాళాలు ఎన్ని వేల కోట్లో తెలుసా?

ప్రముఖ పారిశ్రామిక వేత్త, వ్యాపార దిగ్గజం రతన్ టాటా బుధవారం (అక్టోబర్ 09) అర్థరాత్రి కన్నుమూశారు. టాటా గ్రూప్ అండ్ టాటా సన్స్‌కు గౌరవ్ ఛైర్మన్ గా ఉన్న ఆయన భారతదేశ పారిశ్రామిక పురోగతికి ఎంతో కృషిచేశారు. అలాగే పలు సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టారు. భారతదేశంలోనే అత్యుత్తమ వ్యాపారవేత్తగా పేరు పొందిన రతన్ టాటా మరణం అందరినీ కలచి వేస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు రతన్ టాటా…

Read More

రతన్ టాటా ఆస్తి అంత ఎవరి సొంతం అవుతుంది…?

ప్రముఖ వ్యాపారవేత్త, టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా (86) మరణించారు. అనారోగ్యంతో గత అర్ధరాత్రి ముంబైలోని బ్రీచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. టాటా మరణం పట్ల ప్రతి ఒక్కరు స్పందిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఈ గ్రూపు కంపెనీల మార్కెట్ క్యాప్ 34 లక్షల కోట్ల రూపాయలు. ఒక కుటుంబ సంస్థగా ఎదుగుతూ వచ్చిన టాటా గ్రూప్ నేడు ఆ సంస్థలకు నాయకత్వం వహించే తదుపరి వారసుడు ఎవరు అనే సందిగ్ధావస్థకు చేరింది. 86…

Read More

సంక్షోభ సమయంలో నేనున్నాంటూ ముందుకు వచ్చిన ‘టాటా’

భారత్ ను వణికించిన ఘటనల్లో ముంబై ఉగ్రదాడి ఒకటి. టాటా గ్రూపునకు చెందిన తాజ్ హోటల్ ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో హోటల్ ధ్వంసమైంది. అయినప్పటికీ రతన్ టాటా ముందుండి మరింత దృఢంగా పునర్నిర్మించారు. దాడిలో గాయపడ్డ బాధితులతో పాటు హోటల్ సిబ్బందికి అండగా నిలిచి భరోసానిచ్చారు. కరోనా సమయంలోనూ తన వంతు సాయంగా రూ.1,500 కోట్ల భారీ విరాళం ప్రకటించి దాతృత్వాన్ని చాటుకున్నారు. గొప్ప వ్యాపారవేత్తగానే కాకుండా సమాజ సేవకుడిగా…

Read More

రతన్ టాటా చివరి పోస్ట్ ఇదే..

ప్రముఖ వ్యాపార దిగ్గజం రతన్ టాటా అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన చేసిన లాస్ట్ పోస్ట్ వైరలవుతోంది. 3 రోజుల క్రితం తన ఆరోగ్యంపై వదంతులు ప్రచారం చేయొద్దని ట్విటర్ వేదికగా ఆయన ప్రకటన చేశారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తన గురించి ఆలోచిస్తున్నందుకు ధన్య వాదాలు తెలిపారు. దురదృష్టవశాత్తు పోస్ట్ చేసిన మూడు రోజులకే ఆయన చనిపోయారు. ఇక రతన్ టాటా అందుకున్న పురస్కారాలు…

Read More

రతన్ టాటా మృతి పై ప్రముఖుల సంతాపం

అనారోగ్యంతో గత అర్ధరాత్రి ముంబైలోని బ్రీచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రతన్ టాటా కన్నుమూశారు.రతన్ టాటా మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని వ్యాపారవేత్తలు హర్ష గోయెంకా, ఆనంద్ మహీంద్రా, గౌతమ్ ఆదానీ ట్వీట్లు చేశారు. టాటా ఇకపై లేరన్న విషయాన్ని తాను స్వీకరించలేకపోతున్నానని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. దేశం దిశను పునర్నిర్వచించిన గొప్ప వ్యక్తిని భారత్ కోల్పోయిందని అదానీ ట్వీట్ చేశారు. వ్యాపార ప్రపంచంలో చెరగని ముద్ర వేసిన టాటా ఇక లేరని హర్ష గోయెంకా పేర్కొన్నారు….

Read More