రేపల్లె నియోజకవర్గ నేత మోపిదేవి వెంకట రమణ పార్టీ వీడటంపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. ఆయన విషయంలో ఏనాడు తప్పు చేయలేదని, మోపిదేవి పార్టీ మారడం బాధాకరమని అన్నారు. మండలి రద్దు చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు మోపిదేవిని రాజ్యసభకు పంపామని గుర్తు చేశారు. రాజకీయాల్లో కష్టాలు శాశ్వతం కాదని అన్నారు.
ఇక నిన్న ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో సీఎం చంద్రబాబు సమక్షంలో రాజ్యసభ మాజీ సభ్యుడు మోపిదేవి వెంకట రమణ, మాజీ ఎమ్మెల్సీ బీదా మస్తాన్ రావు లు టిడిపి పార్టీలో చేరారు. వెంకటరమణ, మస్తాన్‌రావులకు పార్టీ కండువాలు కప్పి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు చంద్రబాబు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎంపీలు, టీడీపీ నాయకులు కూడా పాల్గొన్నారు.