సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ పై వేటు వేసిన కూటమి ప్రభుత్వం

AP Ex CID Chief Sanjay Susp

ఆంధ్రప్రదేశ్ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌పై కూటమి ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. తాజాగా ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఫైర్ సర్వీసెస్ డీజీగా పని చేసిన సమయంలో సంజయ్ అవకతవకలకు పాల్పడినట్టు విజిలెన్స్ విభాగం దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సంజయ్‌పై ఈ చర్యలు అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆయన చంద్రబాబు అరెస్టు సమయంలో సీఐడీ చీఫ్‌గా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మారిన తర్వాత ఆయనకు ఎలాంటి కీలక పోస్టింగ్ ఇవ్వకుండా హోల్డ్‌లో ఉంచారు. ఇది అప్పట్లోనే రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.

విజిలెన్స్ దర్యాప్తులో సంజయ్ పై వచ్చిన ఆరోపణలు తీవ్రంగా ఉండటంతో ప్రభుత్వం తక్షణ చర్యలకు పూనుకుంది. ఆయన ఫైర్ సర్వీసెస్ డీజీగా ఉన్న సమయంలో పలు అవకతవకలు జరిగినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక సంజయ్ సస్పెన్షన్ ఉత్తర్వులు వచ్చేసిన తర్వాత అధికారులు మరిన్ని విచారణలు చేపట్టనున్నారు. ఆయన పని తీరు, తీసుకున్న నిర్ణయాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఈ దర్యాప్తు తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది.

కాగా, ఈ పరిణామాలపై సంజయ్ తరఫు వర్గాలు ఇంకా ఎలాంటి స్పందన తెలియజేయలేదు. ఆయనపై అవమానకరమైన ఆరోపణలు చేసి రాజకీయ ప్రయోజనాలు సాధించడమే లక్ష్యమని అనుచరులు భావిస్తున్నారు. మరోవైపు, ప్రభుత్వం తమ చర్యలు న్యాయబద్ధమైనవేనని స్పష్టం చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Top best exclusive denyo generator deals sierracodebhd. Auf amazon sind viele verfilmungen mit und von sean connery zu finden :  . Advantages of local domestic helper.