లంచం తీసుకుంటున్న తాసిల్దార్ బాలకృష్ణ అరెస్ట్..
ముత్తుకురు : ముత్తుకూరు మండలానికి చెందిన వెంకటరమణయ్య అనే రైతు తన తల్లి కాంతమ్మకు సంబంధించిన పొలానికి అడంగల్ లో సవరణలు చేసేందుకు ముత్తుకూరు తాసిల్దార్ కార్యాలయాన్ని సంప్రదించారు. అడంగల్ లో తప్పుగా పడిన నోషనల్ నంబర్ను తీసి ఖాతా నంబర్ గా అప్డేట్ చేసేందుకు పాస్ బుక్కులు మంజూరుకు ముత్తుకూరు తాసిల్దార్ బాలకృష్ణ 25 వేలు లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ డిఎస్పి శిరీష తెలిపారు. ఈమేరకు మంగళవారం 25,000 రూపాయలు నగదు తాసిల్దార్ బాలకృష్ణకు లంచం ఇస్తూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు,, నెల్లూరు జిల్లాలో ఎవరైనా లంచం అడిగితే 9440440057 అనే ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసి అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించాలని డిఎస్పి శిరీష తెలియజేశారు…