‘పుష్ప-2’ ను ఫ్యామిలీ చూడాలంటే కష్టమే..!!

pushpa 2 trailer views

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న “పుష్ప-2” చిత్రం మరో నాల్గు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. “పుష్ప” ముందు భాగం బ్లాక్బస్టర్ హిట్ కావడంతో, అభిమానుల్లో ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అల్లు అర్జున్ పాత్ర, కథ మరియు మ్యూజిక్ పై అభిమానులలో ఎంతో ఆసక్తి ఉంది. ఈ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా టికెట్‌ ధరలు పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. డిసెంబర్‌ 4న రాత్రి 9.30 గంటల బెనిఫిట్‌ షోతో పాటు, అర్ధరాత్రి 1 గంట షోకు కూడా అనుమతి ఇచ్చింది. రాత్రి 9.30 షోకు టికెట్‌ ధరను అదనంగా రూ.800 పెంచింది.

ఈ షో చూడాలంటే రాష్ట్రవ్యాప్తంగా సింగిల్‌ స్క్రీన్‌, మల్టీఫ్లెక్స్‌ ఏదైనా సరే ప్రస్తుతం ఉన్న టికెట్‌ ధరకు అదనంగా రూ.800 చెల్లించాల్సిందే. ఈ పెంపుతో సింగిల్‌ స్క్రీన్‌లో టికెట్‌ ధర సుమారు రూ.1000 అవుతుండగా, మల్టీప్లెక్స్‌లో రూ.1200లకు పైగా అవుతోంది. ఇక అర్ధరాత్రి 1 గంట నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు అదనపు షోలకు కూడా అనుమతి ఇచ్చారు. డిసెంబర్‌ 5 నుంచి 8 వరకు సింగిల్‌ స్క్రీన్‌లలో రూ.150, మల్టీఫ్లెక్స్‌లో రూ.200 పెంచారు. డిసెంబర్‌ 9 నుంచి 16 వరకు సింగిల్‌ స్క్రీన్‌లో రూ.105, మల్టీఫ్లెక్స్‌లో రూ.150 పెంపునకు అనుమతి ఇచ్చారు. ఇక పెరిగిన రేట్ల‌ను బ‌ట్టి టికెట్ ధ‌ర‌ల‌ను చూసుకుంటే.. ఈ సినిమా విడుదలయిన నాలుగు రోజుల పాటు (డిసెంబ‌ర్ 05 నుంచి 08 వ‌ర‌కు) సింగిల్ స్క్రీన్‌లో రూ.354 గా ఉండ‌బోతుండ‌గా.. మల్టీప్లెక్స్‌లో దీని టికెట్ ధర రూ.531గా నిర్ణ‌యించారు. ఇక నాలుగు రోజుల త‌ర్వాత డిసెంబ‌ర్ 09 నుంచి 16 వరకు సింగిల్ థియేట‌ర్‌ల‌లో రూ.300గా.. మల్టీ ప్లెక్స్‌లో రూ.472 ఉండ‌నుంది. అలాగే డిసెంబర్ 17 నుంచి 23 వరకు సింగిల్ థియేట‌ర్‌ల‌లో రూ.200.. మల్టీఫ్లెక్స్‌లో రూ.354గా నిర్ణ‌యించారు. దీంతో ఈ సినిమా టికెట్ రేట్లు దాదాపు 20 రోజుల‌కి కానీ త‌గ్గేలా లేవు.

అయితే మొద‌టి నాలుగు రోజులు ఒక ఫ్యామిలీ నుంచి న‌లుగురు ఈ సినిమాకి వెళ్లాలి అంటే సింగిల్ స్క్రీన్‌లో రూ.1380 అవ్వ‌నుండగా.. మల్టీప్లెక్స్‌లో రూ.2120లు కానుంది. దీంతో టికెట్ ధ‌ర‌లు మూవీపై ఎఫెక్ట్ ప‌డ‌నున్న‌ట్లు సినీ వ‌ర్గాలు అనుకుంటున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Finding opportunity in a saturated market : how to thrive in the skincare and beauty industry biznesnetwork. Clínicas de recuperação para dependentes químicos e alcoólatras. ??.