నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా అదిగో..ఇదిగో అనడమే తప్ప మోక్షజ్ఞ ఎంట్రీ మాత్రం జరగకపోవడం తో అభిమానులు కాస్త ఆగ్రహం గా ఉన్నారు. ఈ క్రమంలో హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రకటించి అభిమానుల్లో ఆనందం నింపారు.
తొలి సినిమానే సూపర్ హీరో కాన్సెప్ట్ తో రాబోతుంది. మోక్షజ్ఞ బర్త్ డే సందర్బంగా విడుదల చేసిన లుక్ మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైనట్టు ప్రశాంత్ వర్మ ప్రకటించారు. PVSU ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఈ సినిమా భారీ బడ్జెట్ తో రానుంది. ఈ సినిమాలో ప్రశాంత్ వర్మ.. మోక్షజ్ఞ లుక్ ను షేర్ చేసారు. అద్దంలో ఉన్న మోక్షజ్ఞను లుక్ ను ప్రశాంత్ వర్మ షేర్ చేసాడు. సింబా ఈజ్ కమింగ్ అంటూ ట్వీట్ చేసాడు. మోక్షు లుక్‌కు అందరూ ఫిదా అవుతున్నారు. ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావ్ అంటూ మోక్షుని నందమూరి ఫ్యాన్స్ పొగిడేస్తున్నారు. ఇకపోతే మోక్షజ్ఞ మూవీలో హీరోయిన్గా బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ కుమార్తె రాశి థడాని నటిస్తోందని తెలుస్తోంది. ఈ యంగ్ బ్యూటీ మోక్షుతో రొమాన్స్ చేయనుందని ఆ మధ్య జోరుగా వార్తలు వచ్చాయి. ఈ సినిమాను ప్రశాంత్ వర్మ.. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే కదా. హనుమాన్ తర్వాత పూర్తి సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.