ఐపీఎల్ 2025 వేలంలో ఐదుగురి కోసం కోట్లు కుమ్మరించిన పంజాబ్ కింగ్స్..

ipl 2025

పంజాబ్ కింగ్స్ ఫ్రాంఛైజీ ఐపీఎల్ 2025 వేలంలో రూ.100 కోట్లకుపైగా పర్సుతో తలపడుతూ ప్లేయర్ల కొనుగోలులో యథేచ్ఛగా ఖర్చు చేసింది. హిట్టర్లు, ఆల్‌రౌండర్లు, స్పిన్నర్లు, ఫాస్ట్ బౌలర్లు, మరియు కెప్టెన్లను జట్టులోకి తీసుకుంటూ తమ బలాన్ని మరింత పెంచుకునే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా, జట్టు సమతుల్యంగా నిలవడానికి అవసరమైన అద్భుత ఆటగాళ్ల కోసం కోట్ల రూపాయల వ్యయం చేసింది. 2024లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఐపీఎల్ విజేతగా నిలిపిన శ్రేయాస్ అయ్యర్ కోసం పంజాబ్ కింగ్స్ ఏకంగా రూ. 26.75 కోట్లు ఖర్చు చేసింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆయన్ని తిరిగి జట్టులోకి తీసుకునేందుకు ఆర్టీఎం కార్డు వాడినప్పటికీ, పంజాబ్ వెనక్కి తగ్గకుండా ఆయన్ని తమ జట్టులోకి చేర్చుకుంది.

ఈ మొత్తం ఐపీఎల్ వేలాల్లో అతిపెద్ద బిడ్లలో ఒకటిగా నిలిచింది.భారత జాతీయ జట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ను రూ.18 కోట్లకు కొనుగోలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఐపీఎల్‌లో గత కొన్ని సీజన్లుగా చాహల్ తన అద్భుతమైన ప్రదర్శనతో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు.అదే విధంగా ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్లు మార్కస్ స్టోయినిస్ (రూ.11 కోట్లు), గ్లెన్ మాక్స్వెల్ (రూ.4.2 కోట్లు)ను తమ జట్టులోకి తీసుకుంది. మాక్స్‌వెల్ కోసం భారీ ధర ఉంటుందని భావించినప్పటికీ, తక్కువ ధరకు కొనుగోలు చేయడం పంజాబ్‌కు లాభదాయకమైంది. అర్షదీప్ సింగ్ కోసం పంజాబ్ ఏకంగా రూ.18 కోట్లు వెచ్చించింది.

అతని డెత్ ఓవర్లలో బౌలింగ్ నైపుణ్యం జట్టుకు కీలకమవుతుందని భావించింది. మెగా వేలంలో మొత్తం రూ.88 కోట్లు ఖర్చు చేసిన పంజాబ్, రిటెన్షన్ కోసం రూ.9.5 కోట్లు ఇప్పటికే ఉపయోగించింది. ఫ్రాంఛైజీ వద్ద ఇప్పుడు మిగిలిన మొత్తం రూ.22.5 కోట్లు మాత్రమే. ఇంకా 13 మంది ప్లేయర్లను జట్టులోకి తీసుకోవాల్సి ఉంది. ఈ బలమైన ఆటగాళ్ల ఎంపికతో పంజాబ్ కింగ్స్ వచ్చే సీజన్‌లో మరింత సమర్థంగా పోటీపడతుందని ఆశిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Safaricom’s half year profits dip amid ethiopian currency woes, increased capex. Nossa clínica possue um elevado padrão de qualidade no tratamento de pessoas com dependência química e saúde e mental. 用規?.