18 ఏళ్ల సమైరా హుల్లూర్, కర్ణాటక రాష్ట్రం నుండి భారతదేశంలో అత్యంత యువ వాణిజ్య పైలెట్‌గా గుర్తింపు పొందింది. ఆమె 18 ఏళ్ల వయస్సులోనే కమర్షియల్ పైలట్ లైసెన్స్‌ను పొందడం అందరికీ ఒక ఆదర్శంగా మారింది. సమైరా తన లక్ష్యాన్ని సాధించడంలో ఎంతో కష్టపడి, ఎంతో సాధనతో అందుకుంది.
సమైరా హుల్లూర్ తండ్రి అమీన్ హుల్లూర్, ఒక ఇంటీరియర్ డిజైనర్, తన కుమార్తెకు ఎప్పుడూ మద్దతు అందించారు.సమైరా మొదట శిక్షణ తీసుకున్నది న్యూఢిల్లీలోని వినోద్ యాదవ్ ఏవియేషన్ అకాడమీలో (VYAA).అక్కడ శిక్షణ పూర్తి చేసిన తరువాత, మరింత నైపుణ్యం సంపాదించేందుకు ఆమె మహారాష్ట్రలోని బారామతిలోని కార్వర్ ఏవియేషన్ అకాడమీలో చేరింది.
ఆమె రెండు సంవత్సరాల కాలంలో 200 గంటల పైగా విమాన ప్రయాణ అనుభవాన్ని పొందింది. ఆరు పరీక్షలను క్లియర్ చేసి, కమర్షియల్ పైలెట్ లైసెన్స్ పొందింది.ఈ ఘనత సాధించడంలో కెప్టెన్ తపేష్ కుమార్ మరియు వినోద్ యాదవ్ గారి శిక్షణ, మార్గదర్శకత్వం సమైరా కోసం ఎంతో విలువైనవిగా మారాయి.
సమైరా చెబుతూ, “నేను ఎప్పుడూ పైలెట్ కావాలని కలలు కనేదాన్ని.నా తల్లిదండ్రులు నన్ను ఎప్పుడూ ప్రోత్సహించారు. కెప్టెన్ కుమార్ నాకు స్ఫూర్తినిచ్చారు. ఆయన 25 ఏళ్ల వయస్సులో లైసెన్స్ పొందారు.ఆయన చూపిన మార్గంలోనే నేను నా లక్ష్యాన్ని చేరుకోగలిగాను అని చెప్పారు.ఈ విజయంతో సమైరా దేశవ్యాప్తంగా యువతకు స్ఫూర్తినిచ్చింది. ఆమె తల్లిదండ్రుల ప్రోత్సాహం మరియు కఠిన శిక్షణతో, ఆమె కలలను నిజం చేసుకుంది. .