సౌదీ అరేబియాలో ఉపాధి కోసం వెళ్లిన శ్రీకాకుళం జిల్లా యువకుల అవస్థలు..
శ్రీకాకుళం : సౌదీలో చిక్కుకున్న శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం, పలాస, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి మండలాలకు చెందిన యువకులు. కంబస్ పరిశ్రమలో ఉద్యోగాల పేరుతో ఒక్కొక్కరి నుంచి లక్షా 20వేలు తీసుకుని 16 మందిని ఏజెంట్లు సౌదీకి పంపారు. సౌదీలో 2 నెలలుగా కష్టపడి పనిచేసినా యాజమాన్యం జీతాలు చెల్లించకపోవడంతో తినడానికి తిండి, తాగునీరు లేక సౌదీలో యువకులు అవస్థలు పడుతున్నారు. ఏజెంట్లకు ఫోన్ చేసినా స్పందించడం లేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సౌదీలో తమ కష్టాలను వివరిస్తూ బాధితులు కుటుంబ సభ్యులకు వీడియో పంపారు.
విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. బతుకుదెరువు కోసం విదేశాలకు వెళ్లిన వలస కూలీలకు అండగా ఉంటానని రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. వీడియో కాల్ ద్వారా బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. విదేశాంగ మంత్రితో మాట్లాడి బాధితులందరినీ స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తానని రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు.