కె ఎల్ డీమ్డ్ టు బి యూనివర్శిటీ స్నాతకోత్సవం వేడుకలో మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్

KL Deemed to be University

కెఎల్ డీమ్డ్ టు బి యూనివర్శిటీ తమ 14 వ వార్షిక స్నాతకోత్సవాన్ని విజయవాడ క్యాంపస్‌లో వైభవంగా జరుపుకుంది, ఇది విద్యార్థులకు, తల్లిదండ్రులకు మరియు అధ్యాపకులకు మహోన్నత సందర్భంగా నిలిచింది. ఈ సంవత్సరం, 166 పిహెచ్‌డి స్కాలర్స్ , 604 పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు మరియు 3,936 అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులతో సహా 4,706 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 42 బంగారు పతకాలు మరియు 37 రజత పతకాలను కూడా ప్రదానం చేశారు. ఈ ప్రతిష్టాత్మకమైన సందర్భం కొత్త అవకాశాలకు నాంది పలుకుతున్న వేళ, సంవత్సరాల తరబడి అంకితభావం మరియు విద్యాపరమైన స్థిరత్వం యొక్క శ్రేష్ఠత కు ప్రతీకగా నిలుస్తుంది.

భారత 14వ రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా హాజరైనందున, ఈ సందర్భం మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. భవిష్యత్తును రూపొందించడంలో విద్య, సమగ్రత మరియు ఆవిష్కరణల యొక్క పరివర్తన శక్తిని వెల్లడి చేస్తూ, విద్యార్థులను నిరంతర అభ్యాసాన్ని స్వీకరించడానికి మరియు వారు పూర్తి సామర్థ్యాన్ని సాధించడానికి కృషి చేయడానికి స్ఫూర్తిని అందించేలా ఆయన ఆలోచనాత్మకమైన రీతిలో స్నాతకోత్సవ ప్రసంగాన్ని చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఇతర గౌరవ అతిథిలలో గౌరవనీయులైన జస్టిస్ శ్రీ అబ్దుల్ నజీర్ జీ, గౌరవనీయులైన ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ మరియు భారత సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వున్నారు వీరితో పాటుగా పాల్గొన్న ఇతర విశిష్ట అతిథులలో శ్రీ రామ్ నాథ్ కోవింద్ సతీమణి శ్రీమతి సవితా కోవింద్ కూడా వున్నారు .

కెఎల్ డీమ్డ్ టు బి విశ్వవిద్యాలయం గౌరవనీయ కులపతి కోనేరు సత్యనారాయణ ఈ వేడుకలకు అధ్యక్షత వహించారు. తన దూరదృష్టితో కూడిన సందేశంతో పట్టాలు తీసుకుంటున్న విద్యార్థులను ప్రేరేపించారు. ఆయన మాట్లాడుతూ “ఈ రోజు మీ విద్యా ప్రయాణానికి ముగింపు మాత్రమే కాదు, రేపటి ప్రపంచానికి నిర్మాతలుగా మీ పాత్రకు నాంది కూడా ! ఈ విశ్వవిద్యాలయంలో, మేము నైపుణ్యం కలిగిన నిపుణులను తీర్చిదిద్దడమే కాకుండా, సవాళ్లను అవకాశాలుగా మార్చగల దార్శనికులను కూడా అభివృద్ధి చేస్తున్నాము. మీరు శ్రేష్ఠత, ఆవిష్కరణలు మరియు సామాజిక బాధ్యతలను ముందుకు తీసుకువెళుతున్నారు. మీరు ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టినప్పుడు, మీ డిగ్రీలు కేవలం జ్ఞానాన్ని మాత్రమే కాకుండా మార్పును ప్రేరేపించే శక్తిని, పరిశ్రమలను విప్లవాత్మకంగా మార్చే శక్తిని మరియు సమాజాన్ని ఉద్ధరించే శక్తిని సూచిస్తాయని గుర్తుంచుకోండి. ప్రపంచంలో మీరు సృష్టించే సానుకూల ప్రభావంతో మాత్రమే మీ నిజమైన విజయం కొలవబడుతుంది” అని అన్నారు.

కెఎల్ డీమ్డ్ టు బి యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ డా. జి. పార్ధ సారధి వర్మ సంస్థ యొక్క పరివర్తన ప్రయాణాన్ని నొక్కిచెప్పారు: “ఈ విశ్వవిద్యాలయంలో, సంప్రదాయ సరిహద్దులను అధిగమించడానికి గ్రాడ్యుయేట్‌లను సన్నద్ధం చేసే ఉద్దేశ్యంతో ఆవిష్కరణలు సరిపోయే వాతావరణాన్ని మేము పెంపొందించాము. మా అత్యాధునిక పరిశోధనా కేంద్రాలు, వ్యూహాత్మక పరిశ్రమ సహకారాలు మరియు అత్యాధునిక సాంకేతికతలపై దృష్టి కేంద్రీకరించడం వల్ల ఆవిష్కరణలు ప్రోత్సహించబడడమే కాకుండా నైతికతలో లోతుగా పాతుకుపోయిన పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేశాయి. నేటి గ్రాడ్యుయేట్లు డిగ్రీలతోనే కాకుండా ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనే దృఢత్వం, పరిష్కారాలను నడిపించే సృజనాత్మకత మరియు కరుణతో నడిపించే జ్ఞానంతో కూడా ప్రపంచంలోకి ప్రవేశిస్తున్నారు” అని అన్నారు.

ఈ మహత్తరమైన రోజున, విద్యార్థులు సాధించిన విజయాలు సత్కరించడం మరియు కలలుకు రెక్కలు తొడగడంతో పాటు క్యాంపస్ వేడుకలతో సజీవంగా మారింది. విశ్వవిద్యాలయ రంగులతో అలంకరించబడిన గ్రాండ్ ఓపెన్-ఎయిర్ థియేటర్ గ్రాడ్యుయేట్‌లను మరియు వారి గర్వించదగిన కుటుంబాలను స్వాగతించింది. పట్టాలను అందుకునే విద్యార్థులు ఆ తరహా వస్త్రధారణలో గర్వంతో మెరిసిపోతుండగా, తల్లిదండ్రులు ఆ ప్రతిష్టాత్మకమైన క్షణాలను ఒడిసిపట్టడంతో మరియు పతక విజేతలు వారి సన్మానాల కోసం సిద్ధం కావడంతో ఉత్సాహం తారాస్థాయికి చేరింది. ఇది గౌరవం , ప్రతిబింబం మరియు కొత్త ప్రారంభాల రోజుగా మారింది.

బి టెక్ , సిఎస్ఈ విద్యార్థిని ఆర్ . ప్రియాంక తన కృతజ్ఞతలు తెలుపుతూ, “ఇక్కడ నా ప్రయాణం నిజంగా అద్భుతమైనది మరియు పూర్తి అభ్యాసంతో ఉంది. నా ప్రొఫెసర్‌ల నుండి వచ్చిన మద్దతు మరియు నేను అందుకున్న అవకాశాలు నాకు ఎదగడానికి మరియు నన్ను నేను కనుగొనడంలో సహాయపడ్డాయి. నేను నా స్నేహితులు మరియు లెక్చరర్ల కు వీడ్కోలు పలుకుతున్నప్పుడు, గతం పట్ల కృతజ్ఞత మరియు భవిష్యత్తు పట్ల ఉత్సాహం వంటి భావోద్వేగాల మిశ్రమాన్ని నేను ఎదుర్కొంటుస్తున్నాను. ఆత్మవిశ్వాసంతో, నా తల్లిదండ్రుల అంచనాలను నెరవేర్చడానికి మరియు నా కలలను సాకారం చేసుకోవటానికి నేను ముందుకు వెళ్తున్నాను” అని అన్నారు.

ఒక పేరెంట్, శ్రీ ఎస్ వెంకటేష్, మాట్లాడుతూ , “తల్లిదండ్రులుగా, ఇంత ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయం నుండి నా బిడ్డ గ్రాడ్యుయేట్ కావడం నాలో ఎనలేని ఆనందాన్ని నింపుతోంది. నాకు, ఈ డిగ్రీ ప్రపంచానికి పాస్‌పోర్ట్ లాగా అనిపిస్తుంది, అతనికి లెక్కలేనన్ని అవకాశాలను తెరిచింది. కాన్వకేషన్‌లో అటువంటి విశిష్ట అతిథులు ఉండటం వల్ల ఈ క్షణాన్ని నా కుటుంబానికి మరియు నాకు మరింత చిరస్మరణీయంగా మరియు ప్రత్యేకంగా చేస్తుంది. ఇప్పుడు ప్రపంచాన్ని ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్న నా బిడ్డ కోసం సరైన స్థలాన్ని ఎంచుకున్నందుకు నేను గర్విస్తున్నాను…” అని అన్నారు.

ఈ వేడుకలో అత్యుత్తమ సాధకులకు పతకాలు అందించటంతో పాటు విద్యార్థులకు డిగ్రీలు మరియు అవార్డుల ప్రదానం జరిగింది. డా. జి. పార్ధ సారధి వర్మ విశ్వవిద్యాలయం వార్షిక నివేదికను సమర్పించారు, అకడమిక్ ఎక్సలెన్స్, అత్యాధునిక పరిశోధన మరియు సామాజిక అభివృద్ధికి దాని నిరంతర నిబద్ధతను ఇది ప్రదర్శించింది. కె ఎల్ డీమ్డ్ టు బి యూనివర్శిటీ, A++ గ్రేడ్‌తో నాక్ చేత గుర్తింపు పొందిన కేటగిరీ 1 సంస్థ, నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (NIRF) 2024లో 22వ ర్యాంక్‌ను పొందింది. విద్యలో 44 సంవత్సరాల నాయకత్వంతో, ఇది ప్రపంచ ప్రతిభను పెంపొందించడం కొనసాగిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Biznesnetwork – where african business insights brew !. Por fim, o acompanhamento contínuo é uma estratégia essencial para prevenir recaídas. 人?.