స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘పుష్ప-2’ సినిమా టికెట్ బుకింగ్స్‌లో సంచలనం సృష్టించింది. బుక్ మై షో ప్లాట్‌ఫారమ్‌లో అత్యంత వేగంగా 10 లక్షల టికెట్లు బుక్ కావడం విశేషంగా నిలిచింది. ఈ విషయాన్ని మేకర్స్ ఓ ప్రత్యేక పోస్టర్ ద్వారా వెల్లడించారు. ప్రేక్షకుల్లో భారీ హైప్ ఉన్న ఈ చిత్రం ఈ నెల 5న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.
తెలుగు రాష్ట్రాల్లో ‘పుష్ప-2’ కోసం అభిమానులు , సినీ ప్రముఖులు ఎంతో ఉత్సహంగా ఎదురుచూస్తున్నారు . బుక్ మై షో లో టికెట్స్ ఓపెన్ అయ్యాయో లేదో.. అభిమానులు , ప్రేక్షకులు ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవడంతో సరికొత్త రికార్డు గా నిలిచింది. తెలంగాణలో ఇప్పటికే బుకింగ్స్ మొదలైయి, చాలా చోట్ల టికెట్లు హౌస్‌ఫుల్ అయ్యాయి. మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతుందని ట్రేడ్ ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు.
సినిమా విడుదల సందర్భంగా టికెట్ ధరల పెంపునకు రెండు తెలుగు ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ఇది నిర్మాతలకే కాకుండా థియేటర్లకు కూడా ఆర్థికంగా లాభదాయకంగా మారింది. ఈ నిర్ణయం ప్రేక్షకులపై మరింత ఆసక్తిని కలిగిస్తూ బుకింగ్స్‌ను పెంచే అవకాశం కల్పించింది. ‘పుష్ప-2’ సినిమా గురించి ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తికి ప్రధాన కారణం అల్లు అర్జున్ స్టైలిష్ నటన, సుకుమార్ దర్శకత్వ ప్రతిభ, దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం. ‘పుష్ప-1’ భారీ విజయాన్ని సాధించడంతో రెండో భాగంపై అంచనాలు మరింత పెరిగాయి. విడుదల తేది దగ్గరపడుతున్న కొద్దీ ఈ సినిమా హైప్ మరింతగా పెరుగుతోంది. అభిమానులు, ప్రేక్షకుల నుంచి లభిస్తున్న ఆదరణకు చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది. ‘పుష్ప-2’ విడుదలతో మరోసారి టాలీవుడ్‌కు జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చేందుకు ఇదో సత్తా చూపే చిత్రం అవుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.