తిరుమలలో టీటీడీ ఆధ్వర్యంలో కార్తీకమాసం సందర్భంగా వనభోజన మహోత్సవం (Karthika Vanabhojanam) ప్రతీ ఏడాది విశేషంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది నవంబర్ 17న ఈ మహోత్సవం నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే వాతావరణశాఖ భారీ వర్ష సూచన ప్రకటించిన నేపథ్యంలో, ఈ వనభోజన కార్యక్రమం వేదికను మార్చారు.
భారీ వర్షాల నేపథ్యంలో పార్వేట మండపంలో కాకుండా వైభవోత్సవ మండపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కార్తీక వనభోజన మహోత్సవంలో భాగంగా ఆదివారం ఉదయం శ్రీవారి ఉత్సవమూర్తులను వైభవోత్సవ మండపానికి తీసుకువస్తారు. ఉదయం 11 నుంచి 12 వరకూ మలయప్పస్వామికి స్నపన తిరుమంజనం నిర్వహిసారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు. అనంతరం తిరిగి ఆలయానికి తీసుకువస్తారు.