ఏడాదికి ఒక్కసారే నిర్వహించే ఉత్సవం ముహూర్తం ఇదే

tirumala 1

తిరుమల దీపావళి పండగ సీజన్, వరుస సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. గురువారం రోజు 63,987 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకోగా, అందులో 20,902 మంది తలనీలాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. హుండీ ద్వారా ఆ రోజు టీటీడీకి రూ.2.66 కోట్ల ఆదాయం వచ్చింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి, ట్రావెలర్స్ బంగ్లా వరకు క్యూలైన్ కొనసాగింది. టోకెన్ లేకుండా వచ్చే భక్తులు శ్రీవారి సర్వదర్శనం కోసం 18-20 గంటలు ఎదురుచూడవలసి వచ్చింది. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు టీటీడీ టీ, పాలు, మంచినీరు అందజేసి సేవలు చేసింది.

ఇక, నవంబర్ 13న కైశిక ద్వాదశి పర్వదినం కావడంతో టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఈ రోజున సాలకట్ల కైశిక ద్వాదశి ఆస్థానం ఘనంగా నిర్వహించబడుతుంది. ఈ సందర్భంగా ఉగ్ర శ్రీనివాసమూర్తిని ప్రత్యేకంగా ఊరేగించడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీవారు శ్రీదేవి, భూదేవి సమేతంగా ఈ ప్రత్యేక ఊరేగింపులో పాల్గొంటారు. ఈ ఉత్సవం కోసం సూర్యోదయానికి ముందే ఊరేగింపును పూర్తి చేస్తారు. 14వ శతాబ్దంలో జరిగిన ఒక అగ్నిప్రమాదం కారణంగా సూర్యోదయానికి ముందుగానే ఉగ్ర శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని ఊరేగించడం అనవాయితీగా మారింది.

ఆ రోజు ఉదయం 6 గంటల నుంచి 7:30 గంటల వరకు ఆలయంలో కైశిక ద్వాదశి ఆస్థాన కార్యక్రమాలు నిర్వహించబడతాయి. అర్చకులు పురాణ పారాయణం చేసి, ప్రత్యేక పూజలు చేస్తారు. దీనితో ఈ ప్రత్యేక పర్వదినం ఉత్సవం పూర్తి అవుతుంది. కైశిక ద్వాదశిని మరో పేర్లతో, ఉత్థానద్వాదశి, ప్రబోధనోత్సవం అని కూడా పిలుస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Kwesi adu amoako. Passos cruciais para prevenir recaídas na dependência química na clínica de recuperação para dependentes químicos. 禁!.